Take a fresh look at your lifestyle.

దక్షిణాదిలో మెర్సిడెస్ బెంజ్ నెట్‌వర్క్ మరింత పటిష్టం

  • హైదరాబాద్​, బెంగళూరులో మూడు అధునాతన లగ్జరీ సర్వీస్ కేంద్రాలు.

ముద్ర, బిజినెస్​: భారత్‌లో అత్యంత ఆకర్షణీయమైన లగ్జరీ కార్ల దిగ్గజం మెర్సిడెస్- బెంజ్ కొత్తగా హైదరాబాద్​, బెంగళూరులో మూడు అధునాతన ఫెసిలిటీలు ఏర్పాటు చేసింది. దీని ద్వారా దక్షిణాది మార్కెట్లలో తమ స్థానాన్ని మరింత పటిష్టం చేసుకున్నట్లు కంపెనీ భావిస్తున్నది. హైదరాబాద్‌లోని మహావీర్ మోటర్స్‌లో ‘డెలివరీ బే’తో 2ఎస్​, బెంగళూరులోని ప్రధానమైన ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్‌ రోడ్‌లో ఉన్న సుందరం మోటర్స్‌లో ‘డెలివరీ బే’తో 2ఎస్​ ఫెసిలిటీ తో వీటిని ప్రారంభం చేసింది.హైదరాబాద్‌లోని ల్యాండ్‌మార్క్ కార్స్‌లోను అధునాతన 2ఎస్​ ఫెసిలిటీనీ మెర్సిడెస్-బెంజ్ ను శుక్రవారం ప్రారంభించింది. కంపెనీ తమ ‘గో టు కస్టమర్’ వ్యూహానికి అనుగుణంగా ఈ విస్తరణ చేపట్టింది. ఈ రెండు ప్రధాన మార్కెట్లలో మెర్సిడెస్-బెంజ్‌లాంటి లగ్జరీ కార్లపై కస్టమర్లకు ఆసక్తి పెరుగుతున్న నేపథ్యంలో ఇది కీలకంగా ఉండనుంది. ప్రస్తుత మార్కెట్లతో పాటు ప్రస్తుతం పటిష్టంగా ఉన్న బెంగళూరు, హైదరాబాద్‌లాంటి మెట్రో మార్కెట్లలోనూ తమ బ్రాండ్‌ ఆకర్షణీయతను మరింత పెంపొందించుకునేందుకు ఇది కంపెనీకి తోడ్పడనుందని మెర్సిడెస్-బెంజ్ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ అండ్​ సీఈవో సంతోష్ అయ్యర్ వెల్లడించారు. డిజిటల్ ఇన్నోవేషన్, ఆధునిక లగ్జరీ డిజైన్, వ్యక్తిగతీకరించిన కస్టమర్ కన్సల్టేషన్‌లాంటి ప్రపంచ స్థాయి లగ్జరీ రిటైల్ అనుభూతిని ఈ ఫెసిలిటీల్లో పొందవచ్చన్నారు. లగ్జరీ ఆటోమోటివ్ రిటైల్‌లో కొత్త ప్రమాణాలు నెలకొల్పుతూ కస్టమర్లకు మెరుగైన, లగ్జరీ రిటైల్ అనుభూతిని అందించడంపై తాము దృష్టి పెట్టామన్నారు. ప్రస్తుతం 50 ప్లస్​ నగరాల్లో 125 టచ్ పాయింట్లతో మెర్సిడెస్-బెంజ్‌కు దేశవ్యాప్తంగా పటిష్టమైన నెట్‌వర్క్ ఉందన్నారు. మెర్సిడెస్-బెంజ్‌ ఇండియా, సుందరం మోటర్స్ దీర్ఘకాలికంగా భాగస్వాములుగా ఉన్నాయని, దక్షిణ భారతదేశంలో ఇది 10వ మెర్సిడెస్-బెంజ్ ఫెసిలిటీ అని, అంతర్జాతీయంగా మెర్సిడెస్-బెంజ్ లగ్జరీ రిటైల్ ప్రమాణాలకు అనుగుణంగా రూపొందిన ఈ కొత్త 2ఎస్​ ఫెసిలిటీ, కంపెనీ యొక్క లగ్జరీ రిటైల్ కాన్సెప్టునకు నిదర్శనంగా నిలుస్తుందన్నారు.తెలంగాణలోని తమ సర్వీస్ నెట్‌వర్క్‌ను మరింత పటిష్టం చేసుకుంటూ,మెర్సిడెస్-బెంజ్ హైదరాబాద్‌లోని మహావీర్ మోటర్స్‌లో అధునాతన ఫెసిలిటీని ఏర్పాటు చేసిందని, హైదరాబాద్‌లో అత్యంత సంపన్నులు నివసించే ప్రాంతంలో ఐటీ కారిడార్‌కి దగ్గర్లో ఉందన్నారు. 39,000 చ.అ. విస్తీర్ణంలోని మహావీర్ మోటర్స్‌లో నెలకు 480 వాహనాలను సర్వీసింగ్ చేసే సామర్థ్యాలతో 19 ప్రత్యేకమైన సర్వీస్ బేలు ఉన్నాయని వివరించారు.

Leave A Reply

Your email address will not be published.