Take a fresh look at your lifestyle.

బస్టాండ్ దొంగతనం ఛేదించిన పోలీసులు…

 
జోగిపేట, ముద్ర ప్రతినిధి
జోగిపేట బస్టాండ్ లో ఆదివారం జరిగిన బంగారం చోరీ కేసును మంగళవారం జోగిపేట పోలీసులు ఛేదించారు. జోగిపేట సిఐ అనిల్ కుమార్ కేసు కు సంబంధించిన వివరాలు వెల్లడించారు. అల్లాదుర్గం గ్రామానికి చెందిన చేగురు లక్ష్మి ఆదివారం హైదరాబాదులో జరిగే బంధువుల వివాహానికి వెళుతూ జోగిపేట బస్టాండ్ లో తన బంధువుల రాక కోసం వేచి ఉంది. బంధువులతో కలిసి బస్సు ఎక్కుతుండగా గుర్తు తెలియని వ్యక్తి తన హ్యాండ్ బ్యాగ్ ని దొంగిలించిన విషయం విధితమే. దొంగతనం సంబంధించి సి సి పూటీజిని పరిశీలించి కొల్చారం మండలంలోని చిన్న ఘనపూర్ గ్రామానికి చెందిన వడ్డెర హనుమమ్మ ను అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు. విచారించగా దొంగతనానికి పాల్పడినట్లు అంగీకరించగా తన వద్ద నుండి 13 తులాల వివిధ అభరణాలను స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసి రిమాండ్ తరలించినట్లు ఆయన వివరించారు

Leave A Reply

Your email address will not be published.