- చెక్కులను అందించిన ఆర్ జి1 జిఎం లలిత్ కుమార్.
ముద్ర ప్రతినిధి, గోదావరిఖని: సుందిళ్ళ గ్రామ రైతులకుసింగరేణి మైనింగ్ లీజు భూముల ఎక్స్ గ్రేషియా పరిహారం రైతులకు చెల్లించారు.అర్జీ 1 ఏరియా జిఎం డి.లలిత్ కుమార్ గురువారం సుందిళ్ళ గ్రామంలో సింగరేణి మైనింగ్ లీజు భూములకు సంబందించిన ఎక్స్ గ్రేషియా పైకమును చెక్కుల ద్వారా రైతులకు చెల్లించారు.ఈ సందర్బంగా జిఎం మాట్లాడుతూ సింగరేణి ఉపరితల గని (జిడికే సిఎం) పరిదిలోని సింగరేణి మైనింగ్ లీజు భూముల లో సుందిళ్ళ గ్రామా రైతులు సింగరేణి భూమిని తాత్కాలికంగా కొంత కాలం జీవనోపాధి కొరకు ఉపయోగించుకున్నారని ఇప్పుడు ఆ భూమిలో సింగరేణి ఉపరితల గని పనులు చేపడుతున్న సందర్భంగా మంత్రి దుద్దిళ్ళ శ్రీధర్ బాబు,కోయ శ్రీహర్ష జిల్లా కలెక్టర్, పెద్దపల్లి, సింగరేణి సిఎం.డి, డైరెక్టర్ (పా) అదేశానుసారం, రెవెన్యు అధికారుల సహకారంతో సింగరేణి యాజమాన్యం ఎక్స్ గ్రేషియా రూ.6,50,000/- ఎకారానికి చొప్పున 16.04 ఎకారాలకు గాను 7 చెక్కులను అందించినట్లు తెలిపారు.ఎక్స్ గ్రేషియా పైకము చెల్లింపు అపలేదని సింగరేణికి అందిన అప్లికేషన్ లను పరిశీలించి అర్హులకు ఎక్స్ గ్రేషియా చెల్లించు ప్రక్రియ కొనసాగుతుందని జిఎం తెలిపారు.ఇది గ్రామ ప్రజలు గమనించాలన్నారు.ఈ కార్యక్రమంలో ఈ.డి.సి కమిటి అధికారులు ఎస్.ఓ.టు జిఎం ఆంజనేయ ప్రసాద్, ప్రాజెక్ట్ అధికారి డి.రమేష్, డిజీ.ఎం సర్వే జి.ఎల్.రాజు, డిజీ.ఎం ఫైనాన్స్ ధనలక్ష్మి బాయి, ఎస్టేట్ అధికారి సాంబశివరావు, లా ఆఫీసర్ అఫ్రిన్ సుల్తానా తదితరులుపాల్గొన్నారు.