- దేశంలోనే అత్యంత ప్రతిభావంత యంగ్ లీడర్ కేటీఆర్.
- కేటీఆర్ జన్మదినం అందరికి పండగ రోజు.
- రామగుండం మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్.
- రామగుండంలో కన్నుల పండగగా కేటీ రామన్న జన్మదిన వేడుకలు.
ముద్ర ప్రతినిధి, గోదావరిఖని: దేశంలోనే అత్యంత ప్రతిభావంతు లైన యంగ్ లీడర్ కేటీఆర్ వారి జన్మదినం అందరికి పండగ రోజని వారి అడుగుజాడల్లో చూపిన బాటలో ముందుకు సాగుతున్నా మని రామగుండం మాజీఎమ్మెల్యే పెద్దపల్లి జిల్లా బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు కోరుకంటి చందర్ అన్నారు.కేటీఆర్ జన్మదినాన్ని పురస్కరించుకుని రామగుండం మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్ ఆధ్వర్యంలో గురువారం కేటీఆర్ జన్మదిన వేడుకలు కన్నుల పండుగ గా నిర్వహించారు. కేటీఆర్ పిలుపు మేరకు గిప్ట్ ఏ స్మైల్ లో భాగంగా సఫాయు కార్మికులకు చేయుత అందించారు.కిడ్నీ వ్యాధి బాధితులకు అర్దిక సహాయం అందించారు.జయ దుర్గ దేవి ఆలయం లో పూజ కార్యక్రమం మెుక్కలు నాటారు.మెడికల్ కళాశాలలో పండ్లు పంపిణితో పాటు విజయమ్మ పౌండేషన్ ఈశ్వర కృప ఆశ్రమంలో అన్న దానం చేశారు. ఈ సందర్భంగా రామగుండం మాజీ ఎమ్మెల్యే పెద్దపల్లి జిల్లా బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు కోరుకంటి చందర్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రాన్ని ఐటి రంగంలో దేశంలో అగ్రగామిగా నిలిపిన ఘనత కేటీఆర్ దన్నారు. బి.ఆర్.ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలకు అండగా నిలుస్తూ మళ్ళీ అధికారం వైపు అడుగులు వేస్తున్న పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నిండునూరేళ్ళు ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలన్నారు.రాష్ట్రంలో అధికారంలో లేకున్నా అధికార పార్టీ నాయకుల నుండి బిఆర్ఎస్ పార్టీ నాయకుల కు,కార్యకర్తలకు ఎదురవుతున్న ఇబ్బందులను అరికట్టడానికి కేటీఆర్ అండగా నిలవడం జరుగుతుందనీ తెలిపారు.తాను ఎమ్మెల్యే గా ఉన్నకాలంలో గిఫ్ట్ ఏ స్మైల్ పేరిట రామగుండం నియోజకవర్గం లో పదుల సంఖ్య లో పేదలకు ఇండ్లను నిర్మించి అందించడం జరిగిందన్నారు. నేడు అధికారంలో లేకున్నా గిఫ్ట్ ఏ స్మైల్ పేరిట కేటీఆర్ జన్మదినం రోజున రామగుండం నియోజక వర్గంలో పేదలకు సహాయం చేయడం,అన్నదానకార్యక్రమాలు, మొక్కలను నాటడం చేపట్టడం జరిగిందని వెల్లడించారు. కేటీఆర్ ఇలాంటి జన్మదిన వేడుకలు ఎన్నో జరుపుకుంటూ,రానున్న రోజుల్లో ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టాలని ఆశించారు.ఈ కార్యక్రమంలో బి ఆర్ ఎస్ పార్టీ నాయకులు కౌశిక హరి,మాజీ కార్పొరేటర్లు, కల్వచర్ల కృష్ణవేణి, బాదే అంజలి, జనగామ కవిత సరోజినీ, పాముకుంట్ల భాస్కర్, నాయకులు గోపు ఐలయ్య యాదవ్, మారుతి, నీరటి శ్రీనివాస్, గుర్రం పద్మ, కనక లక్ష్మీ, ఆరే లక్ష్మి, పర్లపల్లి రవి, బొడ్డుపల్లి శ్రీనివాస్, ప్రశాంత్, కొమురయ్య, రత్నాకర్, శ్రావణ్, చింటూ తదితరులు పాల్గొన్నారు.
