- కుల రాజకీయాలు మానుకోండి.
- పురమల్లకు ఎమ్మెల్యే టిక్కెట్ ఇచ్చి ఆదరించింది కాంగ్రెస్.
- చర్యలు తీసుకున్నది క్రమశిక్షణ కమిటీ..?
- సస్పెన్షన్ కు మంత్రి పొన్నంకు ఏమి సంబంధం..?
- రాష్ట్ర హౌస్ ఫెడ్ మాజీ చైర్మన్ బొమ్మ శ్రీరామ్ చక్రవర్తి.
ముద్ర ప్రతినిధి కరీంనగర్ : ఎంత సీనియర్ లీడర్ అయినా పార్టీ లైన్ దాటితే కాంగ్రెస్ పార్టీలో క్రమ శిక్షణ చర్యలు తీసుకోవడం సహజమేనని రాష్ట్ర హౌస్ ఫెడ్ మాజీ చైర్మన్,బొమ్మ శ్రీరామ్ చక్రవర్తి అన్నారు. నేతల మధ్య సమన్వయ లోపం ఉండకుండా ఏ స్థాయి లీడర్ అయినా కార్యకర్తలందరినీ కలుపుకుని వెళ్లడమే కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతం అన్నారు.తీన్మార్ మల్లన్న (చింతపండు నవీన్), వి.హన్మంతరావు, పురమల్ల శ్రీనివాస్ లు మున్నూరు కాపు కులానికి చెందినవారు. తీన్మార్ మల్లన్న, పురమల్ల శ్రీనివాస్ లను పార్టీ సస్పెండ్ చేయడంతో మున్నూరు కాపుకు చెందిన కొందరు నాయకులు సోషల్ మీడియాలో ఆసత్య ఆరోపణలు చేస్తున్నారని ఆగ్రహాం వ్యక్తం చేసారు.టిపిసిసి అధ్యక్షుడిగా మహేష్ కుమార్ గౌడ్, రవాణా, బీ.సీ. సంక్షేమ శాఖ మంత్రిగా పొన్నం ప్రభాకర్ గౌడ్ లు ఉండటంతో వీరు ఇద్దరూ గౌడ కులానికి చెందడంతో గౌడ కులస్తులు మున్నూరు కాపు కులానికి చెందిన నేతలనే టార్గెట్ చేస్తున్నారంటూ సోషల్ మీడియాలో ఆసత్య ప్రచారాలు చేయడం తగదని హెచ్చరించారు. దేశానికే తెలంగాణ రోల్ మోడల్ ఉండే విధంగా కాంగ్రెస్ అగ్రనాయకుడు రాహుల్ గాంధీ చెప్పినట్టు ఎవరు ఎంతో..వారికి అంత అన్న విధంగా తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ కులగణన చేపట్టిందన్నారు. కులగణన లెక్కలన్ని తప్పుల తడకగా ఉందంటూ కాంగ్రెస్ పార్టీలోనే ఉంటూ తీన్మార్ మల్లన్న తన న్యూస్ ఛానెల్లో కులగణన పత్రాలను కాల్చివేసి పార్టీ లైన్ దాటినపుడు చర్యలు తీసుకోకుండా ఏమి చేస్తారంటూ ఆయన ప్రశ్నించారు. సీఎం రేవంత్ రెడ్డికి తీన్మార్ మల్లన్న అత్యంత సన్నిహితుడు అయినప్పటికి పార్టీ లైన్ దాటితే సస్పెండ్ చేసింది విధితమే. పురుమల్ల శ్రీనివాస్ కాంగ్రెస్ పార్టీలో చేరిన కొద్ది రోజులకే కరీంనగర్ నియోజకవర్గ ఇంచార్జీగా నియమించిందన్నారు.గత అసెంబ్లీ ఎన్నికల్లో ఎమ్మెల్యే టిక్కెట్ ఇచ్చిన ఘనత కాంగ్రెస్ పార్టీది అన్నారు.మంత్రి పొన్నం కృషి లేకుండానే పురుమల శ్రీనివాస్ కు ఎమ్మెల్యే టిక్కెట్ వచ్చిందా చెప్పాలని డిమాండ్ చేసారు.మంత్రి పొన్నం సీనియర్ నాయకుడని బహిరంగంగా అప్రతిష్ట పాలు చేస్తే పార్టీ అధిష్టానం చూస్తు ఉరుకుంటుందా అంటూ ప్రశ్నించారు. పురుమల్ల శ్రీనివాస్ పార్టీ లైన్ పలుమార్లు దాటితే హెచ్చరించిన తన తీరు మార్చుకోకపోవడం వల్లనే పార్టీ సస్పెండ్ చేసిందన్నారు.వేములవాడ ఎమ్మెల్యే టిక్కెట్ ఆది శ్రీనివాస్ కు ఇవ్వడంతో గెలుపొందిన తనకి ప్రభుత్వ విప్ ఇచ్చిందన్నారు. మంత్రి పదవి రాకుండా ఏవరూ కూడా అడ్డుకోవడం లేదని కేవలం కుల రాజకీయాలు చేయడానికే అసత్య ఆరోపణ చేస్తున్నారని అవి మానుకోవాలని హితవు పలికారు.వి.హన్మంతరావు, డి.శ్రీనివాస్, కె.కేశవరావు లను కాంగ్రెస్ పార్టీ పిసిసి అధ్యక్షులను చేసి గౌరవించిందన్నారు. తప్పులు చేసింది వారైతే టిపిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ ల పై ఆసత్య ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. ఇప్పటికైనా ఈ నీచ రాజకీయాలు మానుకోవాలని హితవు పలికారు.