చిట్యాల ముద్ర :
యుద్ధం వల్ల నిత్యావసర వస్తువుల ధరలు పెరగటంతో పాటు గ్యాస్ సరఫరా లో అనేక రకాల ఇబ్బందులను ప్రజలు ఎదుర్కొంటున్నారని సిపిఎం జిల్లా కార్యదర్శి తుమ్మల వీరారెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు.చిట్యాల మండలం వెలిమినేడు గ్రామంలో మంగళవారం నాడు జరిగిన సిపిఎం గ్రామ జనరల్ బాడీ సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు.యుద్ద నివారణ చర్యలు చేపట్టవలసిన భారత దేశ ప్రధాని మోడీ,ట్రంప్ కు అనుకూలంగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు.రాష్టృ ముఖ్య మంత్రి రేవంత్ రెడ్డి కేరళ ఎన్నికల ప్రచారం లో అవాకులు, చవాకులు మాట్లాడటం విడ్డూరంగా ఉందన్నారు.కేరళ ప్రభుత్వం విద్య, వైద్యం, పేదరిక నిర్మూలనకు పెద్ద కృషి చేసి, దేశంలో నే ఆదర్శ పాలన అందిస్తుంటే ఇచ్చిన హామీలను అమలు చేయడంలో చిత్త శుద్ధి ప్రదర్శించాలని డిమాండ్ చేశారు.అర్వలైన పేదలకు ఇండ్లు,ఇళ్ళ స్థలాలు పంపిణీ చేయాలని కోరారు.లేనిపక్షంలో సిపిఎం ఆధ్వర్యంలో ఆందోళనలు చేపట్టవలసి వస్తుందని ఆయన హెచ్చరించారు.పార్టీ సీనియర్ నాయకులు, గ్రామ సర్పంచ్ బొంతల చంద్రారెడ్డి మాట్లాడుతూ గ్రామ సమస్యల పరిష్కారం కోసం కృషి చేయనున్నట్లు తెలిపారు.నెలికంటి నర్సింహా అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు జిట్ట నగేష్,మల్లం మహేష్, మండల నాయకులు అరూరి శ్రీను, పంది నరేష్,సుర్కంటి మోహన్ రెడ్డి,అరూరి దుర్గయ్య,శంభయ్య తదితరులు పాల్గొన్నారు.