Take a fresh look at your lifestyle.

కేజీబీవీ పాఠశాల తనిఖీ. విద్యార్డినీలకు సూచనలు సలహాలు అందించిన తహశీల్దార్ జ్యోతి.

ముద్ర, మోత్కూర్:

మోత్కూర్ మండల కేంద్రంలోని కస్తూర్బా గాంధీ బాలికల పాఠశాల ను బుధవారం తహసిల్దార్ పి జ్యోతి ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా వంటగది, స్టోర్ రూమ్ లోని కూరగాయలు, బియ్యాన్ని పరిశీలించారు. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. పదోతరగతి పరీక్షలు రాస్తున్న విద్యార్థులతో మాట్లాడి సలహాలు సూచనలు చేసి వంద శాతం ఉత్తీర్ణత సాధించాలని సూచించారు. చేశారు. భోజనం బాగుందా అని ఏమైనా ఇబ్బందులు ఉన్నాయ అని విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం విద్యార్థులతో కలిసి మధ్యాహ్న భోజనం చేసి సంతృప్తి వ్యక్తం చేశారు. ఆమె వెంట ఎస్ఓ యాదమ్మ,సిఆర్ టి గణిత ఉపాధ్యాయురాలు ch.లక్ష్మీభాయ్ ఉన్నారు.

Leave A Reply

Your email address will not be published.