మన శంకర వరప్రసాద్ సినిమా టిక్కెట్టు ధరల పెంపుపై హైకోర్టులో పిటీషన్
నివేదిక ఇవ్వాలని జీఎస్టీ అధికారులకు కోర్టు ఆదేశాలు
చిరంజీవి నటించిన మన శంకర వరప్రసాద్ సినిమాకు సంబంధించి ఈ నెల 11 నుంచి 18 వరకు పెంచిన టిక్కెట్టు ధరల వాస్తవ గణాంకాలను సమర్పించాలని జీఎస్టీ అధికారులను హైకోర్టు ఆదేశించింది. సింగిల్ స్క్రీన్‌లకు రూ. 50, మల్టీప్లెక్స్‌లకు రూ. వంద, జీఎస్టీతో కలిపి వివరాలన్నీ నివేదిక రూపంలో ఇవ్వాలని సూచించింది. ఈ సినిమాకు టికెట్ ధరలు పెంపు అక్రమం అని ఆరోపిస్తున్న హైదరాబాద్ కు చెందిన డాక్టర్ పాదూరి శ్రీనివాస రెడ్డి దాఖలు చేసిన పిటిషన్ హైకోర్టు శుక్రవారం విచారణ జరిపింది. ఈ సినిమా అక్రమ సంపాదించిన రూ.45 కోట్లను రికవరీ చేయాలని శ్రీనివాస రెడ్డి తన పిటీషన్ లో కోర్టుకు నివేదించారు. చట్టవిరుద్ధంగా ఈ సినిమా టికెట్ ధరలు పెంచారనీ ఈ సినిమా ఆర్జించిన రూ. 42 కోట్లను ప్రతివాదులు చేసి సంయుక్తంగా, వ్యక్తిగతంగా రాష్ట్ర ప్రభుత్వ సంచిత నిధికి లేదా హైకోర్టు లీగల్ సర్వీసెస్ అథారిటీకి చెల్లించేలా ఆదేశాలు ఇవ్వాలని పిటీషనర్ కోరారు. స్పందించిన కోర్టు… ప్రతివాదులందరికీ నోటీసులు జారీ చేసింది. అలాగే గతంలో దాఖలైన పుష్ప-2, గేమ్ ఛేంజర్, అఖండ-2, రాజా సాబ్ వంటి సినిమాల టికెట్ ధరల పిటిషన్లతో కలిపి తదుపరి వాయిదా విచారిస్తామని పేర్కోంది.