Take a fresh look at your lifestyle.

త్వరలో సింగరేణి అధికారులకు పిఆర్పి చెల్లింపు

  • కనీస వేతనాల సలహా మండలి చైర్మన్ జనక్ ప్రసాద్.

ముద్ర ప్రతినిధి, గోదావరిఖని: సింగరేణిలో పనిచేస్తున్న అధికారులకు త్వరలోనే పర్ఫామెన్స్ రిలేటెడ్ పే (పిఆర్ పి) చెల్లించనున్నట్లు కనీస వేతనాల సలహా మండలి చైర్మన్ ఐఎన్టీయూసీ సెక్రెటరీ జనరల్ జనక్ ప్రసాద్ ప్రకటించారు. ఇప్పటికే సంబంధిత ఫైలు తెలంగాణ ప్రభుత్వ పరిశీలనలో ఉందని, అధికారులకు సంబంధించిన పి.ఆర్.పి చెల్లింపునకు అవసరమైన చర్యలు వేగవంతంగా కొనసాగుతున్నాయని ఆయన తెలిపారు. అధికారుల సంఘం నాయకులు పి.ఆర్.పి చెల్లింపు విషయమై తెలంగాణ రాష్ట్ర కనీస వేతన సలహా మండలి చైర్మన్ జనక్ ప్రసాద్ నీ సంప్రదించగా వారు ప్రభుత్వంతో మాట్లాడతానని హామీ ఇవ్వగా ఇచ్చిన హామీ ప్రకారం జనక్ ప్రసాద్ గతంలో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క సింగరేణి సంస్థ చైర్మన్ మేనేజింగ్ డైరెక్టర్ బలరాం నాయక్ ల దృష్టికి తీసుకెళ్లారు. ప్రభుత్వ సానుకూల స్పందన తోనే ఈ ఫైలు తుది దశకు చేరిందని అన్నారు. ఈ నేపథ్యంలో అధికారుల సంఘం నాయకులు జనక్ ప్రసాద్ కృషిని అభినందించారు. సింగరేణిలో కార్మికుల హక్కుల సాధన కోసమే కాకుండా,అధికారుల సమస్యలపై సానుకూలంగా స్పందించి పి ఆర్ పి చెల్లింపునకు కృషి చేసినందుకు గాను ప్రశంసలు అందుకున్నారు.

Leave A Reply

Your email address will not be published.