Take a fresh look at your lifestyle.

మీడియా అకాడమీ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డికి సాదర స్వాగతం..

 

కరీంనగర్ జిల్లా పర్యటనకు వచ్చిన తెలంగాణ రాష్ట్ర మీడియా అకాడమీ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి కి
శుక్రవారం రాత్రి ఆర్ అండ్ బి గెస్ట్ హౌస్ లో కరీంనగర్ ఆర్డీవో కే మహేశ్వర్ సాదర స్వాగతం పలికారు. మాజీ ఎమ్మెల్యే చాడ వెంకటరెడ్డి శ్రీనివాస్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా పూలబోకే అందించి శాలువాతో సత్కరించారు. వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ (ఐజేయు)నాయకులు శ్రీనివాస్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసి శాలువాలతో సన్మానించారు.


ఈ సందర్భంగా మీడియా అకాడమీ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి ఆర్డిఓతో పలు అంశాలపై చర్చించారు. మీడియా అకాడమీ చైర్మన్ ను కలిసిన వారిలో సమాచార పౌర సంబంధాల శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ జి లక్ష్మణ్ కుమార్, అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇన్ఫర్మేషన్ ఇంజనీర్ ఉషారాణి, సిపిఐ జిల్లా కార్యదర్శి పంజాల శ్రీనివాస్ గౌడ్, ఐజేయూ జాతీయ కార్యవర్గ సభ్యుడు నగునూరి శేఖర్, వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ జిల్లా అధ్యక్షుడు (ఐజేయు) గాండ్ల శ్రీనివాస్, జర్నలిస్టు యూనియన్ నాయకులు ఒంటెల కృష్ణ, ఎలగందుల రవీందర్, చంద్రశేఖర్ తదితరులు ఉన్నారు

Leave A Reply

Your email address will not be published.