మాదాపూర్, ముద్ర: కొండాపూర్ డివిజన్ మసీద్ బండలోని శ్రీవెంకటేశ్వర్ హౌసింగ్ సొసైటీ రెసిడెన్షియల్ వెల్ఫేర్ అసోషియేష్ కాలనీలో నెలకొని ఉన్న సమస్యలు పరిష్కరించాలని స్థానిక ఎమ్మెల్యే, పీఏసీ ఛైర్మన్ అరిగికపూడి గాంధీనీ కలిసి కాలనీ వాసులు మొరపెట్టుకున్నారు.సొసైటీ ఆధ్వర్యంలో గురవారం ఎమ్మెల్యే నివాసంలో కలిసి వినతి పత్రం సమర్పించారు. కాలనీ వాసులు గురువారం వినతి పత్రం సమర్పిస్తూ తమ ఇబ్బందులను వివరించారు.మసీద్ బండ ప్రాంతంలో అతి పెద్ద కాలనీ అయినప్పటికీ ప్రధానంగా రోడ్ల సమస్య తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తోందని గుర్తుచేశారు. కాలనీ ఏరియా కార్పోరేటర్ల ఇద్దరి మద్య కొంత నిర్లక్ష్యానికి గురౌతుందన్నారు. చుట్టూ ఉన్న ఆయా కాలనీ వాసులు వ్యర్థ పదార్థాలను తమ కాలనీలో రాత్రి వేళల్లో డంపు చేయడం తీవ్ర అసౌకర్యంగా ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. చుట్టు పక్కలి ప్రాంతాల్లో ఇళ్ల నిర్మాణం సందర్భంగా బయటపడే బండ రాళ్లను తమ కాలనీలో పడవేడం వల్ల కొత్త సమస్యలు ఉత్పన్నమౌతున్నాయని, కాలనీని పోలీసు పెట్రోలింగ్ ఏర్పాటు చేసేవిధంగా పోలీసుకు సూచించాలని కోరారు.పైగా రెవెన్యూ సిబ్బంది తరచూ కాలనీలో జరుగుతున్న నిర్మాణాలను అడ్డుకుంటూ ప్లాట్ల యజమానులను ఇబ్బందులకు గురిచేస్తున్నారని,మురికి కాలువల నిర్మాణంతో పాటు పార్కులను అభివ్రుద్ధి చేసి,కాలనీ వాసులకు సౌకర్యవంతంగా తీర్చిదిద్దాలని కోరారు.ఇప్పటికే పలుమార్లు మున్సిపల్, పోలీసు అధికారులకు తమ కాలనీ సమస్యలను వినతి పత్రం ద్వార వివరించామని చెప్పారు. స్పందించిన పీఏసీ ఛైర్మన్ గాంధీ ఈ నెల రెండవ వారంలో కాలనీని సందర్శిస్తానని హామీ ఇచ్చారు. వినతి పత్రం సమర్పించిన వారిలో కాలనీ అసోషియేషన్ ప్రతినిధులు ఉన్నారు.