Take a fresh look at your lifestyle.

భూ భారతి తో  ప్రజలలో విశ్వాసం పెరిగింది జిల్లా కలెక్టర్

ముద్ర,రాయికల్  విలేకరి: జగిత్యాల జిల్లా రాయికల్ మండలంలోని వీరాపూర్ మరియు ధావనపల్లి గ్రామాల్లో నిర్వహించిన భూభారతి రెవెన్యూ సదస్సులో జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్ పాల్గొన్నారు. భూముల రికార్డుల డిజిటలైజేషన్, పటాలు సరిచూడటం, స్థానికులకు భూసంబంధిత సమస్యలపై అవగాహన కల్పించటం వంటి అంశాలపై ఈ సదస్సులో చర్చలు జరిగాయి. గ్రామస్థులతో కలెక్టర్ ప్రత్యక్షంగా ముచ్చటించడంతో ప్రజలలో విశ్వాసం పెరిగింది.ఈ కార్యక్రమం గ్రామస్థుల నుంచి మంచి స్పందనను అందుకుంది.భూభారతి ద్వారా భూ సమాచార వ్యవస్థలో పారదర్శకత పెరుగుతుందన్న ఆశాభావాన్ని కలెక్టర్ వ్యక్తం చేశారు.ఈ కార్యక్రమం లో రాయికల్ మండల ఇంఛార్జీ ఎమ్మార్వో నాగార్జున, గిరిధావర్ పద్మయ్య గ్రామ ప్రజలు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.