బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి హరీశ్‌రావుపై చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్ ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ డీజీపీకి ఫిర్యాదు చేశారు. ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణ సందర్భంగా వారిద్దరు సిట్ అధికారులను బెదిరించి.. భయబ్రాంతులకు గురి చేశారని ఆ ఫిర్యాదులో ఆరోపించారు. విచారణలో అధికారులకు సమాధానం చెప్పేలా కాకుండా… విచారణ చేసేలా మాట్లాడారని పేర్కొన్నారు. అధికారులపై ఒత్తిడి తెచ్చే ప్రయత్నం చేశారని ఎమ్మెల్సీ ఆరోపించారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో దర్యాప్తు సంస్థలను బెదిరించడం నేరమనీ వెంటనే తగిన చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డీజీపీని కోరారు.