Take a fresh look at your lifestyle.

బాలానగర్‌లో ఘనంగా అంబేద్కర్‌ జయంతి: పాల్గొన్న జనసేన నేత ముమ్మారెడ్డి ప్రేమ కుమార్‌

ముద్ర కూకట్‌పల్లి :

భారత రాజ్యాంగ నిర్మాత, భారతరత్న డాక్టర్‌ బి.ఆర్‌. అంబేద్కర్‌ 135వ జయంతి వేడుకలు బాలానగర్‌లో ఘనంగా నిర్వహించారు. తెలంగాణ దళిత సంక్షేమ సంఘం ఆహ్వానం మేరకు సైబరాబాద్‌ మున్సిపల్‌ జనసేన పార్టీ కో-ఆర్డినేటర్‌ ముమ్మారెడ్డి ప్రేమ కుమార్‌ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన అంబేద్కర్‌ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు.
అనంతరం ప్రేమ కుమార్‌ మాట్లాడుతూ.. దేశంలోని ప్రతి పౌరుడికి సమాన హక్కులు కల్పించిన మహోన్నత వ్యక్తి అంబేద్కర్‌ అని కొనియాడారు. సమాజంలోని అసమానతలను తొలగించేందుకు ఆయన చేసిన పోరాటం అందరికీ ఆదర్శప్రాయమని పేర్కొన్నారు. అంబేద్కర్‌ ఆశయాలైన సమానత్వం, విద్య, సామాజిక న్యాయం దిశగా ప్రతి ఒక్కరూ పయనించాలని, ముఖ్యంగా యువత ఆయన ఆలోచనలను అందిపుచ్చుకుని దేశాభివృద్ధిలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.