Take a fresh look at your lifestyle.

హత్యా కేసులో నలుగురు నిందితులకు జీవిత ఖైదు – జిల్లా ఎస్పీ నారాయణ రెడ్డి

వికారాబాద్, ముద్ర ప్రతినిధి: వికారాబాద్ జిల్లా ధారూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో నమోదైన హత్యా నేరం లోని ఏ1,ఏ3,ఏ4 , ఏ6 నిందితులకు జీవిత ఖైదు మరియు ఒక్కొకరికి చొప్పున రూ .1000 జరిమానా, నేరస్థులు ఒకవేళ రూ .1000 జరిమానా కట్టకపోతే 4 నెలల సాధారణ జైలు శిక్ష విదిస్తూ ప్రిన్సిపల్ డిస్ట్రిక్ట్ సెషన్స్ జడ్జి డాక్టర్ సున్నం శ్రీనివాస్ రెడ్డి శుక్ర వారం తీర్పు ఇవ్వడం జరిగిందని జిల్లా ఎస్పీ కే.నారాయణ రెడ్డి తెలిపారు. ఈ కేసుకు సంబందించిన వివరాలు ఇలా ఉన్నాయి.
2018 ఏప్రిల్ 22న ఉదయం 9 గంటలకు పెండ్యాల యాదమ్మ (ఫిర్యాదురాలు) భర్త పెండ్యాల శ్రీనివాస్ (మృతుడు) తన స్వంత గ్రామం మైలారం లో పొలం పనులు చూసుకొని వస్తానని తనకు తెలిసిన హరిదాస్ పల్లి గ్రామానికి చెందిన వినోద్ కుమార్ అనే వ్యక్తిని వెంట తీసుకొని వెళ్ళినాడు. పొలం పనులు చూసుకొని తిరిగి ఇంటికి వచ్చే క్రమంలో ఉదయం 11.30 గంటలకు మైలారం గ్రామానికి చెందిన 7 మంది పాత కక్షలు, రాజకీయ కక్షలు మనస్సులో పెట్టుకొని వేట కొడవలి,కర్రలతో వెంబడించి దాడి చేయగా పెండ్యాల శ్రీనివాస్ (మృతుడు)తలకు,మెడకు,చెవికి బలమైన గాయాలతో మృతి చెందాడు అని పెండ్యాల శ్రీనివాస్ (మృతుడు) ని కొడుతుండగా వినోద్ కుమార్ అక్కడి నుండి పారిపోయి పెండ్యాల యాదమ్మ (ఫిర్యాదురాలు)కు సమాచారం అందించినాడు అని ఫిర్యాదురాగ అప్పటి ధారూరు ఎస్‌హెచ్‌ఓ డి.రాజు, ఏ‌ఎస్‌ఐ కేసు నమోదు చేయగా ఐ‌ఓ అప్పటి ధారూర్ సర్కిల్ ఇన్స్పెక్టర్ జే.ఉపేందర్, అప్పటి వికారాబాద్ డి‌ఎస్‌పి శిరిష రాఘవేందర్ ఇన్వెస్టిగేషన్ చేసి కోర్ట్ నందు అప్పటి వికారాబాద్ డి‌ఎస్‌పి శిరీష రాఘవేందర్ ఛార్జ్ షీట్ ను సమర్పించగా వాదోపవాదనలు విన్న డిస్ట్రిక్ట్ సెషన్స్ జడ్జి డాక్టర్ సున్నం శ్రీనివాస్ రెడ్డి నిందితులు ఏ1)మదులపల్లి దాసు,ఏ3)మదులపల్లి ప్రశాంత్ కుమార్,ఏ4)మదులపల్లి అరుణ్ కుమార్ మరియు ఏ6)మదులపల్లి భాస్కర్ లకు జీవిత ఖైదు ఒక్కొకరికి రూ. 1000 జరిమానా, నేరస్థులు ఒకవేళ రూ .1000 జరిమానా కట్టకపోతే 4 నెలల సాధారణ జైలు శిక్ష విధిస్తూ తీర్పు ఇవ్వడం జరిగింది అని జిల్లా ఎస్పీ తెలిపారు.
ఈ కేసులో నిందితునికి శిక్ష పడే విధంగా స్పెషల్ పీపీ పి.సమరసింహ రెడ్డి, ఇన్వెస్టిగేషన్ అధికారులు అప్పటి వికారాబాద్ డి.ఎస్.పి శిరీష రాఘవేందర్, ధారూరు సర్కిల్ ఇన్స్పెక్టర్ జే.ఉపేందర్, అప్పటి ధారూర్ ఎస్‌హెచ్‌ఓ ఏ‌ఎస్‌ఐ రాజు, ఇట్టి కేసు బ్రీఫింగ్ ఆఫీసర్లు అప్పటి ధారూరు ఇన్స్పెక్టర్ రామకృష్ణ, ప్రస్తుత ధారూరు సర్కిల్ ఇన్స్పెక్టర్ సి‌హెచ్.రఘురాములు, ప్రస్తుత ధారూర్ ఎస్‌హెచ్‌ఓ అనిత, సి‌డి‌ఓలు షబ్బీర్ పాషా,శంకర్, లైజనింగ్ ఆఫీసర్ బి.వీరన్న పనిచేయడం జరిగింది. అధికారులను జిల్లా ఎస్పీ కె.నారాయణ రెడ్డి అభినందించడం జరిగింది

Leave A Reply

Your email address will not be published.