ముద్ర, ఉమ్మడి
మహబూబ్ నగర్ జిల్లా ప్రతినిధి :
………………………………………..
పేదలకు ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఉచితంగా నాణ్యమైన వైద్యం అందుతున్నదని ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి అన్నారు.
మహబూబ్ నగర్ ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో కాన్పు అయిన నవజాత శిశువుల తల్లులకు ఎమ్మెల్యే హెల్త్ కిట్లు, హెల్త్ కార్డులను అందించారు.ఈ సందర్బంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పేదలకు ఉచితంగా నాణ్యమైన వైద్యం అందించాలనే లక్ష్యంతో పనిచేస్తున్నామన్నారు.తెలంగాణ రాష్ట్రంలోనే “ఆరోగ్య మహబూబ్ నగర్”గా అభివృద్ధి చేయడమే లక్ష్యమని పేర్కొన్నారు. రెండేళ్లుగా ప్రభుత్వ ఆసుపత్రులను అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తున్నామన్నారు. ప్రజలకు అవసరమైన అన్ని వైద్య సదుపాయాలు ప్రభుత్వ ఆసుపత్రులలోనే అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. ప్రసవం అనంతరం తల్లులు, శిశువుల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని తన సొంత నిధులతో ఏర్పాటు చేసిన యెన్నం హెల్త్ కిట్లు, యెన్నం హెల్త్ కార్డులను అందిస్తున్నామని ఎమ్మెల్యే తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ రంగ అజ్మీర, హాస్పిటల్ డెవలప్మెంట్ కమిటీ సభ్యులు బెజ్జుగం రాఘవేందర్, కాంగ్రెస్ పార్టీ నాయకులు కోస్గి శివప్రసాద్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
మహిళలను ఆర్థికంగా అభివృద్ధి చేస్తాం

మహిళలను ఆర్థికంగా అభివృద్ధి చేయడమే కాంగ్రెస్ ప్రభుత్వ ద్యేయమని ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి అన్నారు.శుక్రవారం మహబూబ్ నగర్ నియోజకవర్గంలోని హన్వాడ మండలానికి చెందిన లబ్ధిదారులకు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో కళ్యాణలక్ష్మి, షాదిముబారక్ చెక్కులను ఎమ్మెల్యే పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ… ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మహిళల సంక్షేమం కోసం పలు కార్యక్రమాలు అమలు చేస్తున్నదన్నారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పించడంతో పాటు తెల్ల రేషన్ కార్డు ఉన్న ప్రతి కుటుంబానికి ఆరు కిలోల చొప్పున సన్న బియ్యం ఉచితంగా పంపిణీ చేస్తున్నామన్నారు. అలాగే అర్హులైన ప్రతి ఒక్కరికి గృహ జ్యోతి పథకం ద్వారా 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అందిస్తున్నామని, సొంత ఇల్లు లేని నిరుపేదలకు ఇందిరమ్మ ఇళ్ల పథకం లో సొంత ఇంటి కల సాకారం చేస్తున్నామని ఎమ్మెల్యే స్పష్టం చేశారు. త్వరలో మహిళలకు రూ.2500 ఆర్థిక సహాయం అందజేస్తామన్నారు. ప్రజల ముఖాల్లో ఆనందం చూడడమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమని, ప్రజల ఆశీర్వాదం ఎల్లప్పుడూ తమపై ఉండాలన్నారు.ఈ కార్యక్రమంలో హన్వాడ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వి.మహేందర్, నాయకులు యాదిరెడ్డి, నవనీత, రమేష్ యాదవ్, , కృష్ణయ్య యాదవ్, రామకృష్ణ, యాదయ్య, బొట్టు శ్రీను, లింగం నాయక్, దాసరి వెంకటయ్య , కృష్ణయ్య, చందర్ నాయక్, కృష్ణ, తహసీల్దార్ కిష్ట్యానాయక్, ఎంపిడిఓ యశోద తదితరులు పాల్గొన్నారు.