Take a fresh look at your lifestyle.

జిల్లా జనరల్ ఆసుపత్రిలో 14 ఏళ్ల బాలికలకు ఉచిత హెచ్‌పీవీ టీకా ప్రత్యేక శిబిరం

 

ముద్ర ప్రతినిది నాగర్ కర్నూల్;

నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ సాధారణ ఆసుపత్రిలో 14 ఏళ్ల వయస్సు గల ఆడపిల్లలకు గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ నివారణ కోసం ఉచిత హెచ్‌పీవీ (HPV) టీకా ప్రత్యేక శిబిరం నిర్వహిస్తున్నట్లు పీపీ యూనిట్ వైద్యాధికారి డాక్టర్ పి. సృజన తెలిపారు.
ఆమె మాట్లాడుతూ 2011 ఏప్రిల్ 1 నుండి 2012 మార్చి 31 మధ్య జన్మించిన 14 ఏళ్ల ఆడపిల్లలకు ఈ టీకా అందిస్తున్నట్లు చెప్పారు. ఈ టీకా ద్వారా భవిష్యత్తులో గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ వచ్చే అవకాశాలను తగ్గించవచ్చని పేర్కొన్నారు.
ప్రభుత్వ సాధారణ ఆసుపత్రిలోని పీపీ యూనిట్ గది నెంబర్ 22లో సోమవారం నుండి శనివారం వరకు ప్రతిరోజు ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 2 గంటల వరకు ఈ టీకాలను ఉచితంగా వేస్తున్నట్లు తెలిపారు.
టీకా కోసం వచ్చే అర్హులైన ఆడపిల్లలు ఆధార్ కార్డు జిరాక్స్ కాపీతో పాటు తల్లిదండ్రులు లేదా సంరక్షకులను వెంట తీసుకుని రావాలని సూచించారు. ఈ టీకా వల్ల ఎలాంటి దుష్ప్రభావాలు ఉండవని ఆమె స్పష్టం చేశారు.
మరిన్ని వివరాల కోసం ప్రభుత్వ సాధారణ ఆసుపత్రి హెల్ప్‌డెస్క్ ఇంచార్జ్ టి. యాదగిరిని నేరుగా లేదా సెల్ నెంబర్ 9014932408 లో సంప్రదించాలని తెలిపారు.

Leave A Reply

Your email address will not be published.