Take a fresh look at your lifestyle.

ఎమ్మెల్యే తక్షణమే హిందువులకు క్షమాపణ చెప్పాలి-తుంగతుర్తి సర్పంచి మల్లె పాక సాయిబాబు

*హిందు ధర్మాన్ని అవమానించడం ఎమ్మెల్యే మందుల సామేల్ కు తగదు

ముద్ర…. తుంగతుర్తి…..
ఇటీవల హైదరాబాదులోని గాంధీ భవన్ లో జరిగిన ఒక కార్యక్రమంలో తుంగతుర్తి శాసనసభ్యుడు మందుల సామేల్ హిందూ ధర్మానికి అవమానం కలిగే విధంగా మాట్లాడుతూ హిందూ ధర్మాన్ని కాపాడే బ్రాహ్మణుల పట్ల అసభ్యంగా మాట్లాడడం ఎంత మాత్రం తగదని తుంగతుర్తి సర్పంచ్ మల్లెపాక సాయిబాబు అన్నారు . ఆదివారం విలేకరులతో మాట్లాడుతూ శాసన సభ్యుడు హిందూ మతం కానందున హిందూ ధర్మాన్ని అగౌరవ పరిచే మాటలు మాట్లాడటం
ఇది కాంగ్రెస్ పార్టీ విధానమా, లేక
సామేల్ విధానమా అని ప్రశ్నించారు ఎవరికి నచ్చిన మతం వాళ్ళు ఆచరించవచ్చఅని, కాని పరాయి మతాన్ని కించపరచడం తగదు అని అన్నారు ఎమ్మెల్యే వెంటనే హిందువులకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు వేదికల మీద విషయ పరిజ్ఞానం లేకుండా ఏది పడితే అది మాట్లాడితే నవ్వుల పాలు కావాల్సి వస్తుందని అన్నారు

Leave A Reply

Your email address will not be published.