రామకృష్ణాపూర్, ముద్ర విలేకరి: సింగరేణి ఏరియా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న కార్మిక కుటుంబాలకు మెరుగైన వైద్య సేవలు అందించాలని సింగరేణి మెడికల్ చీఫ్ ఆఫీసర్ డాక్టర్ కిరణ్ రాజ్ కుమార్ అన్నారు.సోమవారం ఆర్కేపీ ఏరియా ఆసుపత్రి సందర్శనకు వచ్చిన ఆయనకు వైద్యులు,సిబ్బంది స్వాగతం పలికారు.ముందుగా అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేశారు.అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు.రాబోయే రోజుల్లో అన్ని విభాగాల్లో వైద్యులను, సిబ్బందిని నియమించి సింగరేణి కార్మిక కుటుంబాలకు వైద్య సేవలను అందిస్తామన్నారు.అలాగే ఆసుపత్రి సిబ్బంది క్రమశిక్షణతో విధులు నిర్వహించాలని,సంబంధం లేని విషయాల్లో జోక్యం చేసుకోవద్దని సూచించారు.వార్డుల్లో చికిత్స పొందుతున్న పేషెంట్ల ఆరోగ్య వివరాలను అడిగి తెలుసుకున్నారు. వైద్యులు,సిబ్బంది,యూనియన్ లీడర్లు పాల్గొన్నారు.