- పీయేసీ చైర్మన్ ఆరెకపూడి గాంధీ.
హఫీజ్ పేట్, ముద్ర విలేఖరి: హఫీజ్పెట్ డివిజన్ పరిధిలోని కైదమ్మ కుంట చెరువు సుందరీకరణలో భాగంగా నెక్షాస్ సెలెక్ట్ మాల్స్ కంపెనీ సీయేస్సార్ ఫండ్స్ ద్వారా మల్లిగవాడ్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో స్వచ్ఛందంగా చేపట్టనున్న చెరువు పునర్జీవనంలొ భాగంగా సుందరికరణ మరియు పునరుద్ధరణ పనులను ఇరిగేషన్ మరియు జలమండలి అధికారుల తో కలిసి పరిశీలించిన పీయేసీ చైర్మన్ ఆరెకపూడి గాంధీ.ఈ సందర్భంగా చైర్మన్ అరెకపూడి గాంధీ మాట్లాడుతూ కైదమ్మ కుంట చెరువు దశ దిశ మారునని, వర్షాకాలం లోపు పనులు పూర్తి చేసి ప్రజలకు అందుబాటులో కి తీసుకురావాలని, కైదమ్మ కుంట చెరువు పునరుద్ధరణ ప్రభుత్వం, పరిశ్రమలు మరియు సమాజం మధ్య భాగస్వామ్య ప్రయత్నాలు అర్ధవంతమైన పర్యావరణ పురోగతిని ఎలా నడిపించగలదో చెప్పడానికి ఒక శక్తివంతమైన ఉదాహరణగా నిలుస్తుంది. ఈ ప్రాజెక్ట్ కీలకమైన సహజ వనరులను పునరుజ్జీవింపజేయడమే కాకుండా రాష్ట్రవ్యాప్తంగా భవిష్యత్తులో సుస్థిరమైన అభివృద్ధి కోసం ఒక నమూనాను ఏర్పాటు చేస్తుంది’’ అని అన్నారు.కైదమ్మ కుంట చెరువు కు నేటి తో దశ దిశ మారినది అని, ఎన్నో ఏండ్ల సమస్య నేటి తో తిరునని, శాశ్వత పరిష్కారం దిశగా చెరువును అభివృద్ధి చేపట్టడం జరిగినది అని, మురికి కూపంలాంటి చెరువు స్వచ్చమైన మంచి నీరు లాంటి చేరువుగా తీర్చిదిద్దడమే ధ్యేయం గా పని చేసి నిరూపించడం జరుగుతుంది అని ,చెరువు పునర్జీవనం తరువాత సుజల జలం తో అపురూప దృశ్యకావ్యం గా ఆవిష్కృతమైతది అనడంలో ఎటువంటి సందేహం లేదు అని, చెరువు కట్ట చుట్టూ చెట్లు పెంచి చక్కటి ఆహ్లాదకరమైన వాతావరణం కలిపిస్తామని ఎమ్మెల్యే గాంధీ తెలియచేసారు.అదేవిధంగా చెరువు సుందరికరణ లో భాగంగా చెరువు కట్ట పటిష్టం పరిచేలా పునరుద్ధరణ, మురుగు నీరు చెరువు లో కలవకుండా ప్రత్యేకంగా చెరువు చుట్టూ నిర్మించే మురుగు నీటి కాల్వ (UGD) నిర్మాణం మరియు అలుగు మరమ్మత్తులు, చెరువు కట్ట బలోపేతం ,పునరుద్దరణ పనులు, వాకింగ్ ట్రాక్ వంటి పనులు చేపడుతామని గాంధీ హామీ ఇచ్చారు.చెరువు అపరిశుభ్రం వలన పేరుకుపోయిన గుర్రపు డెక్క వలన దోమల పెరగడం వలన స్థానికులకు ఏర్పడుతున్న ఇబ్బందులను అనారోగ్యాలకు గురవడం స్థానికులు పలుమార్లు ఎమ్మెల్యే గారికి పిర్యాదు చేయడం వలన దీనికి స్పందించిన ఎమ్మెల్యే స్థానికులు పడుతున్న ఇబ్బందులను తొలగించడానికి గతంలో చెరువును దత్తత తీసుకొని సొంత నిధులతో చెరువును శుభ్రపరిచి సుందరీకరణ చేసిన సంగతి విదితమే .అదేవిధంగా ప్రజలకు చక్కటి ఆహ్లాదకరమైన వాతావరణాన్ని అందిస్తామని చెప్పడం జరిగినది, తామర పువ్వులను పెంచి కలుషితం కాకుండా చెరువును సుందరీకరిస్తామని ఎమ్మెల్యే గాంధీ చెప్పారు. చెప్పటం జరిగినది .చెరువులను సుందరీకరించి ప్రజలకు అందుబాటులోకి తీసుకువస్తామని ,చెరువులు కలుషితం కాకుండా మరియు కబ్జాలకు గురికాకుండా చెరువులను పూర్తి స్థాయి లోసంరక్షిస్తామని, చెరువు చుట్టూ పెన్సింగ్ ఏర్పాటు చేసి వాకింగ్ ట్రాక్ ను ఏర్పాటు చేసి ,ప్రజలకు చక్కటి ఆహ్లాదకరమైన వాతావరణాన్ని కల్పిస్తామన్నారు.ఈ కార్యక్రమంలో ఇరిగేషన్ అధికారులు DE నళిని, AE పావని, జలమండలి అధికారులు మేనేజర్ శ్రీ హరి CSR ఐటి సంస్థ ప్రతినిధులు చైతన్య ,రాము నాయకులు సుదేశ్ మరియు కాలనీ వాసులు తదితరులు పాల్గొన్నారు.