మహిళా సాధికారత కోసం ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్న ప్రభుత్వం
ఎక్కువ పథకాలు మహిళలను దృష్టిలో పెట్టుకొని ప్రవేశ పెట్టినవే
సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి
ముద్ర, కరీంనగర్ :
కరీంనగర్ రూరల్ మండలం బహదూర్ఖాన్ పేట లో రూపాయలు పది లక్షలతో నిర్మించిన మహిళా సమైఖ్య భవనాన్ని సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా నరేందర్ రెడ్డి మాట్లాడుతూ జాతీయ ఉపాధి హామీ పథకం సంబంధించిన నిధులతో నిర్మించిన మహిళా భవనం ఈ రోజు ప్రారంభించుకోవడం సంతోషంగా ఉందని దీన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. రాష్ట్ర ప్రభుత్వం అనేక పథకాలను మహిళా సాధికారత దృష్టిలో పెట్టుకొని అమలు చేస్తోందని నరేందర్ రెడ్డి పేర్కొన్నారు.సర్పంచ్ గుర్రం సంధ్య తిరుపతి రెడ్డి ఈ సంఘ భవనం త్వరిత గతిన పూర్తి చేసి అందుబాటులోకి తీసుకురావడం అభినందనీయమన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపిడిఓ జగన్ మోహన్ రెడ్డి,డీఈ జనార్దన్,ఏఈ సమ్మయ్య,కంరెడ్డి రంరెడ్డి, సాయిని తిరుపతి, సర్పంచులు మోతే ప్రశాంత్ రెడ్డి,బోగొండ ఐలయ్య,కూర నరేష్ రెడ్డి,కామల్ గౌడ్,లక్ష్మి నారాయణ,రాజు,అంజయ్య, బాపురెడ్డి,తిరుపతి,అంజయ్య, మహిళా మండల్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.