ముద్ర ప్రతినిధి గోదావరిఖని: సింగరేణి సంస్థ ఆర్జీ-1 ఏరియా జనరల్ మేనేజర్ కార్యాలయంలో మంగళవారం 2025-26 ఆర్థిక సంవత్సరంను పురస్కరించుకోని ఫైనాన్స్,ఎకౌంట్స్ డిపార్ట్ మెంట్ ఆధ్వర్యంలో ధన లక్ష్మి దేవి పూజను జి ఎం లలిత్ కుమార్ పాల్గొని వేద బ్రాహ్మణులచే శాస్త్రోక్తముగా ప్రత్యేక పూజలు నిర్వహించారు.ఈ సందర్భంగా జియం మాట్లాడుతూ 2024-25 ఆర్థిక సంవత్సరమును ముగిసి నూతన ఆర్థిక సంవత్సరము 2025-26 గణాంకాలు ఏప్రిల్ నెలలో మొదలయి మార్చితో ముగుస్తాయని ప్రతి ఆర్థిక సంవత్సరం మొదటి రోజున ఈ విధంగా లక్ష్మి దేవి పూజ చేయడం అనావాయితిగా లక్ష్మి దేవి కృప కటాక్షాల కొరకు సింగరేణి సంస్థ ఉత్పత్తి ఉత్పాదకథా పెంపొందించుకొని మంచి లాభాల బాటలో ముందుకెళ్ళాలని ఫైనాన్స్ ఎకౌంట్స్ విభాగపు అధికారులందరు ప్రత్యేకంగా ఈ పూజలో పాల్గోని లక్ష్మి దేవి ఆశీస్సులు తీసుకుంటే ఈ ఆర్థిక సంవత్సరము అంతా మంచి జరుగుతుందని తెలిపారు.ఈ కార్యక్రమంలో జీఎం సేఫ్టీ అర్జీ రీజియన్ కె.హెచ్.ఎన్ గుప్తా, క్వాలిటీ జియం అర్జీ రీజియన్ భైధ్య,యస్.ఓ.టు జిఎం గోపాల్ సింగ్,ఏరియా ఇంజనీరు దాసరి వెంకటేశ్వర్ రావు,డిజియం ఫైనాన్స్ ధనలక్ష్మి బాయి, డిజియం పర్సనల్ కిరణ్ బాబు, అకౌంట్స్ అధికారులు క్రాంతి కుమార్, శ్రీహర్ష,రజిని ఇతర అధికారులు సాయి ప్రసాద్, రవీందర్ రెడ్డి,ఇందురి సత్యనారయణ,బీమా,రాజన్న, హనుమంత రావు,శ్రావణ్ తదితరులు పాల్గొన్నారు.