ముద్ర ప్రతినిధి, భువనగిరి :
పట్టణంలోని జీనియస్ పాఠశాలకు చెందిన విద్యార్థులు అంతర్జాతీయ స్థాయిలో నిర్వహించిన ఇంటర్నేషనల్ సైన్స్ ఒలంపియాడ్ పోటీ పరీక్షల్లో బంగారు పతకాలు సాధించారని ప్రిన్సిపల్ బి స్వర్ణలత తెలిపారు. శుక్రవారం పాఠశాలలో ఆమె మాట్లాడుతూ11 డిసెంబర్ 2025న అంతర్జాతీయ స్థాయిలో నిర్వహించిన ఇంటర్నేషనల్ సైన్స్ ఒలంపియాడ్ పోటీ పరీక్షల్లో152 మంది విద్యార్థులు పాల్గొనగా ఫలితాలు జనవరి 12 2026 న ప్రకటించడం జరిగిందన్నారు. ఈ ఫలితాలలో పాఠశాలకు చెందిన వివిధ తరగతులకు చెందిన విద్యార్థులు 24 మంది విద్యార్థులు అత్యుత్తమ ప్రతిభను కనబరిచి బంగారు పథకాలు సాధించారని నిర్వాహకులు అందజేసిన బంగారు పథకాలు ప్రశంసా పత్రాలు వారికి అందజేసి అభినందించారు. ఇదే పట్టుదలతో భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలని అన్నారు. పాఠశాల యాజమాన్యం విద్యార్థులకు ప్రత్యేక అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయ బృందం పాల్గొన్నారు.