- ప్రభుత్వ విప్ అడ్డూరి లక్ష్మణ్ కుమార్.
ధర్మపురి, ముద్ర: ప్రజలకు ఉపయోగపడే పలు సేవా కార్యక్రమాలు చేపట్టి సామాజిక సేవా కార్యక్రమాల్లో భాగస్వాములవ్వడం అభినందనీయమని ప్రభుత్వ విప్, ధర్మపురి ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు.శుక్రవారం ధర్మపురి పట్టణ కేంద్రంలోని బ్రాహ్మణ సంఘంలో ప్రజల సౌకbర్యార్థం మంథని సీతారామ సేవసదన్ వారి సౌజన్యంతో బ్రాహ్మణ సంఘ గాయత్రి నిత్య అన్నదాన సత్రం అన్నపూర్ణ సేవాసమితి ఆధ్వర్యంలో నూతన అంబులెన్స్ ను ప్రభుత్వ విప్ లక్ష్మణ్ కుమార్ ప్రారంభించారు.ఈ సందర్భంగా విప్ లక్ష్మణ్ కుమార్ మాట్లాడుతూ మంథని సీతారామ సేవసదన్ వారి సౌజన్యంతో బ్రాహ్మణ సంఘ గాయత్రి నిత్య అన్నదాన సత్రం అన్నపూర్ణ సేవాసమితి సామాజిక సేవ కార్యక్రమంలో భాగంగా ఏర్పాటు చేసిన అంబులెన్స్ ను ప్రారంభించడం చాలా సంతోషంగా ఉందన్నారు.వారు చేస్తున్న సేవలను అభినందిస్తున్నామని, అధికారులు, ప్రజల సహకారంతో ధర్మపురి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారి బ్రహ్మోత్సవాలను అత్యంత వైభవోపేతంగా నిర్వహించడం జరిగిందని, ఆలయ అర్చకులు, అధికారుల సూచనల మేరకు స్వామి వారి కళ్యాణాన్ని మొదటి సారి బయట నిర్వహించడం జరిగిందన్నారు.గోదావరిలో సివరాజ్ నీరు కలవకుండా ప్లాంట్ ఏర్పాటుకు కూడా అన్ని చర్యలు తీసుకుంటామని, ధర్మపురి ప్రాంత అభివృద్ధికి కట్టుబడి ఉన్నామని తెలిపారు.ఈ సందర్భంగా అంబులెన్స్ ని ఏర్పాటుచేసిన నిర్వాహకులను ప్రత్యేకంగా అభినందించారు.ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
