Take a fresh look at your lifestyle.

క్వాయిల్ పక్షుల పెంపకం పై రైతులకు శిక్షణ

కోరుట్ల, ముద్ర విలేకరి: పీవీ నరసింహారావు తెలంగాణ పశు వైద్యం విశ్వవిద్యాలయం కోరుట్లలోని పశు వైద్య కళాశాల పశుగణన క్షేత్ర ఆధ్వర్యంలో జాతీయ మాంస పరిశోధన సంస్థ వారి సహకారంతో బుధవారం రోజు క్వాయిల్ పక్షుల పెంపకం పై రైతులకు శిక్షణ ఇచ్చారు. ఈ సందర్భంగా కళాశాల అసోసియేట్స్ డీన్ డాక్టర్ దాసరి శ్రీనివాస్ క్వాయిల్ పక్షుల పెంపకం యొక్క కరపత్రాన్ని ఆవిష్కరించి, వాటి ప్రాముఖ్యతను వివరించి రైతులకు అందజేశారు. పశుగణన క్షేత్ర సముదాయం విభాగాధిపతి డాక్టర్ శ్రీదేవి మాట్లాడుతూ పక్షుల పెంపకం గ్రామీణ ప్రజలకు జీవనోపాధిగా ఏలా ఉపయోగపడుతుంది అనే అంశం పై పక్షుల మాంసం, వాటి గుడ్ల ప్రాముఖ్యతను, వివరించారు. పక్షుల యజమాన్య పద్ధతులు గృహనిర్వహణ, దాణ నిర్వాహణ, వ్యాధులు వాటి నివారణ, చర్యలపై రైతులకు వివరించారు. ఈ కార్యక్రమంలో డాక్టర్లు సకారం, కీర్తన, సౌమ్య, సుష్మ, శిరీష, రవికాంత్, సురేష్ లు పాల్గొన్నారు.

 

Leave A Reply

Your email address will not be published.