Take a fresh look at your lifestyle.

ప్రభుత్వ సైన్స్ డిగ్రీ కళాశాలలో ఘనంగా ఉగాది సంబరాలు

ముద్ర ప్రతినిధి నాగర్కర్నూల్:

నాగర్ కర్నూల్ ప్రభుత్వ సైన్స్ డిగ్రీ కళాశాలలో విద్యార్థులు పరాభవ సంవత్సర ఉగాది పండుగను ఘనంగా జరుపుకున్నారు. తెలుగువారి నూతన సంవత్సర ప్రారంభాన్ని పురస్కరించుకుని, అధ్యాపకుల సమక్షంలో ఉగాది వేడుకలను ఆనందోత్సాహాలతో నిర్వహించారు.

ఈ సందర్భంగా ఉగాది సంప్రదాయాన్ని ప్రతిబింబించే విధంగా ప్రాంగణాన్ని అందంగా అలంకరించారు. సహజసిద్ధంగా ఉగాది పచ్చడి తయారు చేసి, పండుగ ప్రత్యేకతను విద్యార్థులు అనుభవించారు. ఈ కార్యక్రమాన్ని తెలుగు విభాగం ఆధ్వర్యంలో నిర్వహించారు.

వేడుకల సందర్భంగా విద్యార్థులు సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొని సందడి చేశారు. సంప్రదాయ వేషధారణలో పాల్గొని ఉగాది పండుగను మరింత వైభవంగా నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ మదన్ మోహన్, ఏవో మొహమ్మద్ ఇర్ఫాన్, అధ్యాపకులు అంజయ్య, వనిత, ఉమాదేవి, కోదండరాములు, రామకృష్ణ, దశరథం, ముజఫర్, రాఘవేందర్, నరేష్, శోభారాణి తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.