Take a fresh look at your lifestyle.

పోగొట్టుకున్నది….అప్పగించారు.. నిజాయితీగా బాధితురాలికి బంగారు వస్తువు అప్పగింత

 

ముద్ర, నారాయణపేట:

బంగారం ధరలు రోజురోజుకు పెరుగుతున్నాయి. సుమారు మూడు తులాల బంగారు వస్తువును గుండుమల్ మండలం భక్తిమల్ల గ్రామానికి చెందిన గుజ్జ చెన్నమ్మ అనే బాధితురాలు కోస్గి పట్టణంలోని లక్ష్మీ నరసింహ గార్డెన్ హాల్లో జరిగిన వేడుకలో పోగొట్టుకుంది. ఇదే పెళ్లి వేడుకకు హాజరైన పలువురు కానిస్టేబుల్ ఎల్లప్ప, చంద్రశేఖర్, తనుజ్ లకు బంగారు వస్తువు కనిపించింది. దీంతో విచారణ చేసి బాధితురాలికి బంగారు వస్తువును అప్పగించి నిజాయితీని చాటుకున్నారు. లక్షల విలువ చేసే బంగారు వస్తువు తిరిగి దొరకడంతో బాధితురాలు పోలీసులకు కృతజ్ఞతలు తెలిపింది.

Leave A Reply

Your email address will not be published.