Take a fresh look at your lifestyle.

మిషన్ భగీరథ నూతన పైపు లైను పనులు ప్రారంభం

ముద్ర ప్రతినిధి, యాదాద్రి భువనగిరి :
పట్టణంలోని 22వ వార్డు పరిధిలోని న్యూ రామ్ నగర్ లో నూతనంగా ఇండ్ల నిర్మాణం అయిన ప్రాంతంలో గత కొన్ని సంవత్సరాల నుండి మిషన్ భగీరథ పైపు లైను లేదని గత వారం ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లడంతో వెంటనే పనులను ప్రారంభించాలని సంబంధిత అధికారులను ఆదేశించగా పనులను సోమవారం మునిసిపల్ చైర్ పర్సన్ తంగళ్లపల్లి శ్రీవాణి రవికుమార్, వైస్ చైర్ పర్సన్ పోతంశెట్టి మంజుల వెంకటేశ్వర్లు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో నాయకులు స్థానికులు చల్ల కిషోర్, పుల్ల శివ, భుషపక బిక్షపతి, జాలిగం శివ, శివతేజ, శ్రీనివాస్ చారి, దినేష్, సంతోష్ సిబ్బంది కృష్ణ పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.