మంథని, ముద్ర: మంథని మున్సిపల్ కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తాలో మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు సాదుల శ్రీకాంత్ ఆధ్వర్యంలో దుద్దిల్ల శ్రీను బాబు జన్మదిన వేడుకలు నిర్వహించారు. అనంతరం మంథని ప్రభుత్వ ఆసుపత్రిలో మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు సాదుల శ్రీకాంత్, మాజీ యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు ఎరుకల ప్రవీణ్ ఆధ్వర్యంలో బ్లడ్ డొనేషన్ క్యాంపు నిర్వహించారు. మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఆయిలి ప్రసాద్, మంథని పాక్స్ చైర్మన్ కొత్త శ్రీనివాస్, మాజీ యూత్ కాంగ్రెస్ మండల అధ్యక్షులు ఎరుకల ప్రవీణ్, మహిళా నాయకులు సంతోషిని, నిహారిక పాల్గొన్నారు. పట్టణంలోని మహా గణపతి దేవాలయంలో జిల్లా మీడియా ఇంచార్జ్ అరెల్లి కిరణ్ గౌడ్, కాంగ్రెస్ పార్టీ బీసీ సెల్ ఆధ్వర్యంలో దత్తాత్రేయ స్వామి దేవాలయంలో ప్రత్యేక పూజలు చేశారు.
- యైటింక్లయిన్ కాలనీలో
యైటింక్లయిన్ కాలనీ,ముద్ర: పార్టీ జిల్లా నాయకుడు ఎం.రాజిరెడ్డి, పట్టణ అధ్యక్షులు గుండేటి రాజేష్ విద్యార్థులకు పెన్నులు, పెన్సిల్లు, చాక్లెట్లు, బిస్కెట్లు పంచిపెట్టి, నిరుపేదలకు అన్నదానం నిర్వహించారు. నాయకులు జె.దామోదర్ రావు, దేవనపల్లి చక్రపాణి, యాదగిరి తిరుపతి, కేశవులు, అనుము రాములు, పి.ప్రశాంత్, మహేష్, సారయ్య, అవినాస్, నవీన్, రాకేష్, అజయ్, అక్షయ్, రాజు, నాగరాజు పాల్గొన్నారు.

