- స్పెషల్ చీఫ్ సెక్రటరీ వికాస్ రాజ్.
ముద్ర, తెలంగాణ బ్యూరో :జూన్ 2న నిర్వహించనున్న తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలకు ఏర్పాట్లను పకడ్బందీగా చేపట్టాలని ప్రభుత్వ ప్రత్యేక ముఖ్య కార్యదర్శి వికాస్ రాజ్ అన్నారు. హైదరాబాద్ లోి పోలీస్ పరేడ్ గ్రౌండ్ లో జరుగుతున్న సభా ఏర్పాట్లను ఆయన బుధవారం పరిశీలించారు. ఈ వేడుకలను ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న నేపథ్యంలో ఎక్కడా.. ఎలాంటి లోపాలు, తప్పులు జరగకుండా చూడాలని సంబంధిత అధికారులకు సూచించారు. సభా ప్రాంగణంలోనే ఉండి ఏర్పాట్లను దగ్గరుండి పర్యవేక్షించాలని ఆేశించారు. ఈ కార్యక్రమంలో రెవిన్యూ ప్రిన్సిపల్ సెక్రెటరీ నవీన్ మిట్టల్,వ్యవసాయ శాఖ కార్యదర్శి రఘునందన్ రావు, హైదరాబాద్ జిల్లా కలెక్టర్ అనుదీప్ దురుశెట్టి, అడిషనల్ డీజీపీ సంజయ్ కుమార్ జైన్, అడిషనల్ డీజీపీ (పర్సనల్ )అనిల్ కుమార్,సంజయ్ కుమార్ జైన్ విక్రమ్ సింగ్ మాన్,అడిషనల్ సీపీ లా అండ్ ఆర్డర్, జిహెచ్ఎంసి కమిషనర్ ఆర్వి కర్ణన్,ఎండి హెచ్ఎం అశోక్ రెడ్డి పాల్గొన్నారు.

