మోత్కూర్ ముద్ర న్యూస్:
మోత్కూర్ మున్సిపాలిటీ అభివృద్ధి చెందాలంటే అది కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమవుతుందని రాష్ట్ర మంత్రి సీతక్క అన్నారు. శనివారం మోత్కూర్ లో మున్సిపాలిటీ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆమె మాట్లాడుతూ ప్రతి మున్సిపాలిటీ అభివృద్ధి చెందాలంటే అది కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమవుతుందని ప్రతి ఒక్క సోదరి సోదరమణులు అర్థం చేసుకోవాలని అన్నారు. గతంలో ఎన్నడు లేని విధంగా మోత్కూరును కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే మందుల సామేల్ గెలిచిన తర్వాతనే అభివృద్ధి చేయడం జరిగిందని ఆమె అన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో రాష్ట్రాన్ని అభివృద్ధి పథకంలో నడిపించడానికి అందరూ కృషి చేయాలని అన్నారు. ప్రతి మహిళ నేడూ ఉచిత ప్రయాణం చేయడం జరుగుతుందని సంక్షేమ పథకాలు ప్రతి ఒక్కరి కి అందచేయడం జరుగుతుందని అందుకే చేతి గుర్తుకు ఓటు వేసే గెలిపించాలని ఆన్నారు. ఎమ్మెల్యే మందుల సామేల్ మాట్లాడుతూ గత ఎమ్మెల్యే భూ దోపిడి, ఇసుక దోపిడి చేసి కోట్లు దండుకున్నారని తుంగతుర్తి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయలేదని ఇప్పుడు ఏ మొఖం పెట్టుకొని మాట్లాడుతున్నారు ప్రజలకు వివరించవలసిన అవసరం ఉందని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు , కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు
