వనపర్తి మున్సిపాలిటీ ఎన్నికల్లో ఓటర్లు నిర్భయంగా తమ ఓటు హక్కును వినియోగించు కుంటున్నారని జిల్లా ఎస్పీ సునితరెడ్డి పేర్కొన్నారు. బుధవారంపోలింగ్ కేంద్రాలను సందర్శించి ఓటర్లకు భరోసా కల్పించారు.ఎన్నికల ప్రక్రియ ముగిసే వరకు ప్రత్యేక పోలీసు నిఘా ఉందన్నారు. మున్సిపల్ ఎన్నికలు వనపర్తి జిల్లాలో ఎటువంటి అవాంఛనీయ ఘటనలకు తావులేకుండా ప్రశాంతంగా కొనసాగుతున్నాయని ఎస్పీ తెలిపారు.

ప్రభుత్వ బాలుర జూనియర్ కళాశాల, హరిజనవాడ ప్రభుత్వ ఉన్నత పాఠశాల, ఇంద్ర కాలనీ ప్రభుత్వ పాఠశాలలో పోలింగ్ కేంద్రాలను ఎస్పీ సందర్శించారు. ప్రజలు పోలీసు శాఖకు పూర్తి సహకారం అందించి, ప్రజాస్వామ్య పండుగను ప్రశాంతంగా, గౌరవప్రదంగా ముగించేందుకుబాధ్యతాయుతంగా వ్యవహరించాలని జిల్లా ఎస్పీ కోరారు.ఎస్పీ వెంట డిఎస్పి, వెంకటేశ్వర్రావు, సీఐ, రత్నం, స్పెషల్ బ్రాంచ్ సిఐ, నరేష్,రిజర్వ్ ఇన్స్పెక్టర్, శ్రీనివాస్, వనపర్తి పట్టణ ఎస్సై, హరి ప్రసాద్, పోలీస్ సిబ్బంది తదితరులు ఉన్నారు
