Take a fresh look at your lifestyle.

బండి రమేష్‌కు శుభాకాంక్షల వెల్లువ

తెలంగాణ కమ్మ కార్పొరేషన్ చైర్మన్‌గా నియామకంపై హర్షం

ముద్ర కూకట్‌పల్లి :

తెలంగాణ రాష్ట్ర కమ్మ కార్పొరేషన్ చైర్మన్‌గా నియమితులైన టీపీసీసీ ఉపాధ్యక్షులు, కూకట్‌పల్లి కాంగ్రెస్ ఇంచార్జ్ బండి రమేష్‌కు అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. ఈ సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా ఉన్న కమ్మ సేవా సంఘాల ప్రతినిధులు, వివిధ కుల సంఘాల నాయకులు ఆయనను మర్యాదపూర్వకంగా కలిసి ఘనంగా సన్మానించారు.బండి రమేష్ నివాసంలో మరియు కార్యాలయంలో ఆయనను కలిసిన నాయకులు బొకేలు అందించి, శాలువాలతో సత్కరించారు. పార్టీ పట్ల ఆయనకున్న నిబద్ధత, కష్టపడే తత్వం మరియు అందరినీ కలుపుకుపోయే గుణమే ఈ పదవికి కారణమని వారు కొనియాడారు. కేవలం కమ్మ కార్పొరేషన్ మాత్రమే కాకుండా, అన్ని వర్గాల అభివృద్ధికి ఆయన కృషి చేయాలని వారు ఆకాంక్షించారు.ఈ సందర్భంగా బండి రమేష్ మాట్లాడుతూ.. పార్టీ తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటానని తెలిపారు. తనకు అప్పగించిన పదవులను బాధ్యతగా భావిస్తానని, అందరి సహకారంతో కార్పొరేషన్ అభివృద్ధికి మరియు ప్రజా సమస్యల పరిష్కారానికి శక్తివంచన లేకుండా కృషి చేస్తానని పేర్కొన్నారు.

Leave A Reply

Your email address will not be published.