Take a fresh look at your lifestyle.

ఇందిరమ్మ ఇండ్లు త్వరతగతిన పూర్తి చేయాలి

 

మహదేవపూర్, ముద్ర:

ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు వేగం పెంచేలా అధికారులు చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ అన్నారు. కొన్ని చోట్ల లబ్ధిదారులు మంజూరు పత్రాలు అందుకుని ఇంటి నిర్మాణాలకు పునాది వేసిన వారికి అవగాహన కల్పించి వేగంగా పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు.బుధవారం ఐడిఓసీ కార్యాలయంలోని కాన్ఫరెన్స్ హాల్ లో మున్సిపల్, గృహ నిర్మాణ శాఖ అధికారులు, ఎంపీడీవో లతో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలపై సమావేశం నిర్వహించారు. జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ
ఆన్లైన్ లో సమస్య ఉంటే వెంటనే తన దృష్టికి తీసుకురావాలని, మహిళా సంఘాల ద్వారా రుణాలు ఇప్పించేందుకు చర్యలు తీసుకోవాలని సూచించారు.పైలెట్ గ్రామాలలో పూర్తి స్థాయిలో నిర్మాణాలు పూర్తి చేయాలని తెలిపారు.
కాంట్రాక్టర్ ద్వారా నిర్మాణం అవుతున్న ఇళ్లను త్వరిత గతిన పూర్తి చేసేందుకు ఆదేశాలు ఇవ్వాలని సూచించారు.క్షేత్ర స్థాయిలో పంచాయతీ సెక్రటరీలు నిరంతరం పర్యవేక్షించాలని తెలిపారు.
ఈ సమావేశంలో స్థానిక సంస్థలక అదనపు కలెక్టర్ విజయలక్ష్మి, మున్సిపల్ కమిషనర్ ఉదయ్ కుమార్, హాసింగ్ ఏ.ఈ శ్రీకాంత్, అన్ని మండలాల ఎంపీడీవో లు, హాసింగ్ ఏ.ఈ లు తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.