ముద్ర, తెలంగాణ బ్యూరో : జోగులాంబ గద్వాల జిల్లా గట్టు తహసీల్దార్ సరిత రాణిని జిల్లా కలెక్టర్ సంతోష్ సస్పెండ్ చేశారు. విధి నిర్వహణలోనూ, ప్రభుత్వ పథకాల సర్వేలో నిర్లక్ష్యం వ్యవహరించడంతో పాటు అదనపు కలెక్టర్ నిర్వహించిన సమీక్షకు రాకపోవడంతో తహసీల్దార్ సరిత రాణి సస్పెండ్ అయ్యారు.