ముద్ర ప్రతినిధి, యాదాద్రి భువనగిరి :
తేమ, తాలు, తరుగు పేరుతో క్వింటాలుకు రెండున్నర కిలోల నుండి నాలుగున్నర కిలోల వడ్లను రైతుల నుండి దండుకోవడాన్ని విరమించుకోవాలని సీపీఎం కేంద్ర కమిటీ సభ్యులు ఎస్. వీరయ్య డిమాండ్ చేశారు. ఐకేపీ సెంటర్లలో, మార్కెట్ కేంద్రాలలో రైతులకు ధాన్యం నిలువ కోసం షెడ్లు, టార్పాల్లు(కవర్లు), తాగడానికి నీళ్లు ఏర్పాటు చేయాలని వారు ప్రభుత్వానికి సూచించారు. గురువారం భువనగిరి మండల పరిధిలోని అనాజిపురం గ్రామంలోని ఐకేపీ కేంద్రాన్ని సీపీఎం నాయకత్వంతో కలిసి సందర్శించిన అనంతరం అక్కడున్న రైతులతో మాట్లాడి వారి సమస్యలు తెలుసుకున్న అనంతరం వీరయ్య మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఒక్క గింజ కూడా వదలకుండా కొనుగోలు చేస్తామని రైతులెవ్వరు కూడా భయపడవద్దని బాధపడవద్దని ధైర్యంగా ఉండమని ఊకదంపుడు ముచ్చట్లు చెప్తున్నారని అన్నారు. ఒక్కసారి వడ్లు తెచ్చి మార్కెట్లో కుప్ప పెడితే నెల రోజులకు పైగా సీరియల్ వచ్చేవరకు పడుతుందని ఆ నెల రోజులపాటు రైతులు ఆకాశం వైపు చూసి ఏడవాలో నవ్వాలో దిక్కుతోచని పరిస్థితిలో ఉంటూ ఎప్పుడు వానొస్తదో అనే భయంతో బతుకుతవలసి పరిస్థితి ఏర్పడిందని ఆవేదన వెలిబుచ్చారు. ప్రాణాలను పణంగా పెట్టి పంటను పండించుకునే దుస్థితి ఎప్పటికీ రైతులకు రాష్ట్రంలో ఉన్నదని అన్నారు. ఎప్పుడైతే రైతుల సమస్యలు పరిష్కారం అవుతాయో అప్పుడూ మన రాష్ట్రం బాగుపడుతుందని తెలిపారు. రాష్ట్రంలో రైతులు సమస్యల సుడిగుండం నుండి ఎప్పుడు ఘట్టెకుతాడని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఈ కార్యక్రమంలో సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు కొండమడుగు నర్సింహ్మ, మండల కార్యదర్శి పల్లెర్ల అంజయ్య, మండల కార్యదర్శివర్గ సభ్యులు ఏదునూరి మల్లేశం, మండల నాయకులు గునుగుంట్ల శ్రీనివాస్, గ్రామ సర్పంచ్ రాయపురం సురేష్, మండల నాయకులు పాండాల మైసయ్య, జిట్ట అంజిరెడ్డి, శాఖ కార్యదర్శి కొడాలి కృష్ణ, నాయకులు పిట్టల వెంకటేష్, యండి.రపీక్, గంగదారి భాను, రైతులు పన్నాల నరెందర్ రెడ్డి, బొల్లెపల్లి రామచంద్రం, గోగు పోషయ్య, బోయపల్లి దామోదర్ రెడ్డి, పిట్టల చంద్రయ్య, గడుసు నరేష్, శ్రీరాం చంద్రకళ, గోగు మంగమ్మ, బొల్లెపల్లి మంగమ్మ పాల్గొన్నారు.
Naresh is a Asst Editor and he is working with our organisation and he has good knowledge on Content uploads and Content Management in website. He takes cares of all Content uploads and Content administration on our website.
Next Post