Take a fresh look at your lifestyle.

నీటి ఎద్దడి నివారించకపోతే అమర నిరాహార దీక్ష చేస్తాం

  • బిజెపి నాగర్ కర్నూలు జిల్లా ప్రధాన కార్యదర్శి గంగిశెట్టి నాగరాజు.
  • నీటి ఎద్దడి పై మోకాళ్లపై కూర్చొని నిరసన వ్యక్తం చేసిన బిజెపి నాయకులు గ్రామ ప్రజలు.

అచ్చంపేట ముద్ర విలేఖరి: నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేట నియోజకవర్గం అమ్రాబాద్ మండల కేంద్రంలో నీటి ఎద్దడి పై బిజెపి పార్టీ ఆధ్వర్యంలో వినూత్నమైన పద్ధతిలో మోకాళ్లపై కూర్చుని నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా జిల్లా ప్రధాన కార్యదర్శి గంగిశెట్టి నాగరాజు మాట్లాడుతూ 8 బోర్లు ఐదు నెలలు ఆరు నెలలు ఏడు నెలలు 8 నెలలు పనిచేయక మిషన్ భగీరథ నీళ్లు వారం రోజుల నుండి రాక గతంలో వచ్చినప్పుడు రెండు మూడు బిందెలే వచ్చేవి కానీ వారం రోజుల నుండి మిషన్ భగీరథ నీళ్లు రాక 8 బోర్లు పనిచేయక ప్రజలు స్నానాలకు, బట్టలు ఉతకడానికి, కాలకృత్యాలు తీర్చుకోవడానికి నీళ్లు లేక నానా ఇబ్బంది పడుతున్నారు కానీ అమ్రాబాద్ గ్రామ కార్యదర్శి మిషన్ భగీరథ సంబంధించిన అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించి ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నారన్నారు స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణ వెంటనే స్పందించి మిషన్ భగీరథ సంబంధించిన అధికారులపై ఈ బోర్ మోటర్లు రిపేర్ చేయించకుండా ప్రజలను ఇబ్బంది పెడుతున్న అధికారులపై విచారణకు ఆదేశించి వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. నీటి ఎద్దడి లేకుండా మిషన్ భగీరథ నీళ్లు ప్రతిరోజు వచ్చే విధంగా కనీసము 20 బిందెల నీళ్లు వచ్చే విధంగా 8 బోరు మోటార్లను రిపేర్ చేసి ప్రజలకు మంచినీళ్లు వచ్చే విధంగా చర్యలు తీసుకోవాలని లేని పక్షంలో అమ్రాబాద్ లో నీటి కోసం అమర నిరాహార దీక్ష చేయడానికి ప్రజలతో పాటు బిజెపి నాయకులు సిద్ధంగా ఉన్నారని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో బిజెపి మండల అధ్యక్షులు బొడ్డుపల్లి శ్రీనివాస్, మాధగోని సతీష్ కుమార్, భోగరాజు శంకర్, ఎర్ర గిన్నెల వెంకటేష్ చారి, ఎలిజాల అభిరామ్, ఎలిజాల లక్ష్మయ్య, మురుపోజు సత్యనారాయణ చారి, కాసోజు విష్ణు చారి, మురుపోజు పండరి, మురుపోజు కృష్ణయ్య చారి, కాసోజు చక్రపాణి , జల్ల శివ గౌడ్, మొగిలి గణేష్, చరణ్, వినయ్ ,మహిళలు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.