Take a fresh look at your lifestyle.

ఎన్టీఆర్ జయంతి వేడుకల్లో పాల్గొన్న రాగం నాగేందర్ యాదవ్

మాదాపూర్, ముద్ర విలేఖరి: శేరిలింగంపల్లి నియోజకవర్గంలోని హైదర్ నగర్, మయూరినగర్, ఎల్లమ్మబండ మరియు పలు కాలనీలలో శేరిలింగంపల్లి శాసనసభ్యులు, పీఎసీ ఛైర్మెన్ అరేఖపూడి గాంధీతో మియాపూర్ డివిజన్ కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్, అల్ల్విన్ డివిజన్ కార్పొరేటర్ దొడ్ల వెంకటేష్ గౌడ్, హైదర్ నగర్ డివిజన్ కార్పొరేటర్ నార్నె శ్రీనివాస్ తో కలిసి స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి జన్మదిన వేడుకల్లో పాల్గొని ఎన్టీఆర్ గారి విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించిన శేరిలింగంపల్లి కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్.ఈ సందర్భంగా నాగేందర్ యాదవ్ మాట్లాడుతూ ఎన్టీఆర్ తెలుగువారి ఆత్మగౌరవాన్ని ప్రపంచవ్యాప్తంగా చాటి చెప్పిన మహోన్నత నేత అని అన్నారు. తన నటనతో ప్రత్యేక గుర్తింపు సాధించుకుని, ఎన్నో వైవిధ్యమైన పాత్రలు పోషించి, విలక్షణ నటుడిగా, రాజకీయ నాయకుడిగా, ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రిగా పనిచేసిన ఎన్టీఆర్‌ గారు అన్నిరంగాల్లో తనదైన ముద్ర వేశారని కొనియాడారు. ఈ వేడుకల్లో శేరిలింగంపల్లి డివిజన్ గౌరవ అధ్యక్షులు వీరేశం గౌడ్, పవన్ కుమార్, పురం విష్ణువర్ధన్ రెడ్డి, తదితర డివిజన్ల సీనియర్ నాయకులు, మహిళలు తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.