ముద్ర ప్రతినిధి, నిర్మల్:
విద్యుత్ ఉద్యోగుల సమస్యలను ప్రభుత్వం పరిష్కరించే దిశగా చర్యలు తీసుకోవాలని నిర్మల్ ఎంఎల్ఏ ఏలేటి మహేశ్వర్ రెడ్డి డిమాండ్ చేశారు. తెలంగాణ విద్యుత్ ఆర్టిజన్ ఎంప్లాయీస్ జాయింట్ యాక్షన్ నిర్మల్ కమిటీ ఆధ్వర్యంలో చేస్తున్న నిరసనలకు ఆయన సంఘీ భావం ప్రకటించారు. గత 10 రోజుల నుండి చేపట్టిన నిరసన కార్యక్రమాల్లో భాగంగా గురువారం వంటా వార్పు కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యుత్ ఉద్యోగుల డిమాండ్లను ప్రభుత్వం పరిష్కరించాలని కోరారు. విద్యుత్ ఉద్యోగులకు పూర్తి మద్దతుగా భారతీయ జనతా పార్టీ ఉంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో విద్యుత్ ఉద్యోగ సంఘాల నాయకులు, బీజేపీ సీనియర్ నాయకులు రావుల రాంనాథ్ తో పాటు తదితరులు పాల్గొన్నారు.