Take a fresh look at your lifestyle.

తహసీల్దార్ కార్యాలయాన్ని తనిఖీ చేసిన అదనపు కలెక్టర్ చంద్రారెడ్డి

(ముద్ర ప్రతినిధి – ఉమ్మడిరంగారెడ్డి జిల్లా ): జిల్లా అదనపు కలెక్టర్ (రెవెన్యూ) కె.చంద్రా రెడ్డి గురువారం జిల్లేడు చౌదరిగూడ తహశీల్దార్ కార్యాలయాన్ని తనిఖీ చేశారు. ఈ సందర్బంగా జిల్లేడు చౌదరిగూడ మండలానికి సంబంధించిన భూభారతి పెండెన్సీ క్లియర్ చేయమని, మీసేవ ఎస్ఎల్ ఏ గడువు దాటిన పెండింగ్ కేసులు, ఎఫ్ లైన్ పిటిషన్లు క్లియర్ చేయాలని ఆయన ఆదేశించారు. ప్రభుత్వ భూములను రక్షించాలని, ప్రజల అవసరాలను తీర్చడానికి సిబ్బంది అందుబాటులో ఉండాలని, సిబ్బందికి కేటాయించిన పనులను సకాలంలో పూర్తి చేసే విధంగా చూడాలని అన్నారు. ప్రభుత్వ భూముల పరిరక్షణ విషయంలో జీపీఎస్‌లు చాలా తీవ్రంగా వ్యవహరించాలని, పెండెన్సీ లేకుండా క్లియర్ చేయాలని తహసిల్దారుకు అదనపు కలెక్టర్ చంద్రారెడ్డి సూచించారు.

Leave A Reply

Your email address will not be published.