Take a fresh look at your lifestyle.

కల్లు బాధితులను పరామర్శించిన అరికపూడి గాంధీ

మాదాపూర్, ముద్ర విలేఖరి: ఆల్విన్ కాలనీ డివిజన్ పరిధిలోని సాయి చరణ్ కాలనీ లో 12 మంది కల్తీ కల్లు తాగి తీవ్ర అస్వస్థతకు గురై రాందేవ్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న విషయం తెలుసుకొని వెంటనే రాందేవ్ ఆసుపత్రికి వెళ్లి బాధితులను పరామర్శించి, మెరుగైన వైద్య సహాయం అందించాలని డాక్టర్లకు సూచించిన చైర్మన్ ఆరెకపూడి గాంధీ.ఈ సందర్భంగా చైర్మన్ గాంధీ మాట్లాడుతూ కల్తీ కల్లు ఘటన జరగడం చాలా బాధాకరం అని , ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడే వారు ఎంతటి వారైన కఠిన చర్యలు తీసుకుంటామని, ఘటన పై పూర్తి స్థాయిలో దర్యాప్తు చేయాలని అధికారులను ఆదేశించారు.బాధితులకు మెరుగైన వైద్యం ప్రభుత్వం తరపున అందిస్తామని, అన్ని విధాలుగా అండగా ఉంటానని, ఎవరు అధైర్య పడకూడదని ,ఇలాంటి ఘటనలు మళ్ళీ పునరావృతం కాకుండా అన్ని రకాల చర్యలు తీసుకోవాలని, అధికారులు అలసత్వం వీడి ఎప్పటికప్పుడు తనిఖీలు చేపట్టాలని,పేద ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడే వారి పై కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులకు చైర్మన్ గాంధీ తెలియచేసారు.కల్తీ కల్లు సేవించిన వారు వాంతులు, విరోచనాలు, లో బీపీ సమస్యతోకూకట్‌పల్లి రాందేవ్ ఆసుపత్రిలో చికిత్స నిమిత్తం రావటం జరిగింది, వచ్చిన వారందరూ కల్లు తాగటం వల్ల అస్వస్థతకు గురైనట్లు తెలుసుకున్న ఆసుపత్రి సిబ్బంది పోలీసులకు సమాచారం అందించారని, సమాచారం అందుకున్న పోలీసులు, ఆరోగ్య శాఖ సిబ్బంది ఆసుపత్రికి చేరుకొని విచారణ చేపట్టారు. కాగా బాధితులంతా హైదర్ నగర్, ఎల్లమ్మబండ, తదితర ప్రాంతాల్లో కల్తీ కల్లు సేవించటం వల్ల అనారోగ్యానికి గురైనట్లు గుర్తించారు. కల్తీ కల్లు వ్యవహారం అవ్వటంతో ప్రోహివిషన్ అండ్ ఎక్సైజ్ శాఖ అధికారులు దర్యాప్తు చేపడుతున్నారని చైర్మన్ గాంధీ తెలియచేసారు.ఈ కార్యక్రమంలో డాక్టర్ యోబ్ , నాయకులు జిల్లా గణేష్, కాశినాథ్ యాదవ్, కిషన్, పురెందర్ రెడ్డి, ఎల్లం నాయుడు, భాస్కర్, శ్రీనివాస్ మరియు తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.