Take a fresh look at your lifestyle.

ప్రారంభమైన రాష్ట్ర స్థాయి ఫుట్ బాల్ పోటీలు

రామకృష్ణాపూర్, ముద్ర విలేకరి : స్థానిక సింగరేణి ఠాగూర్ స్టేడియంలో నిర్వహించే రాష్ట్రస్థాయి జూనియర్ బాలికల ఫుట్ బాల్ పోటీలు బుధవారం ప్రారంభమయ్యాయి. నాలుగు రోజుల పాటు జరిగే పోటీలలో సుమారు 12 జట్లు పాల్గొననున్నాయి. తొలి రోజు పోటీలను బెల్లంపల్లి ఏసిపి రవికుమార్,మందమర్రి సీఐ శశిధర్ రెడ్డి,పట్టణ ఎస్సై జీ.రాజశేఖర్,జిల్లా ఫుట్ బాల్ అసోసియేషన్ సభ్యులు ప్రారంభించారు. ఆదిలాబాద్ జిల్లా ఫుట్ బాల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించే పోటీలలో పాల్గొనే క్రీడాకారులకు అన్ని ఏర్పాట్లు, బోజన వసతి కల్పించినట్లు నిర్వాహకులు తెలిపారు.

Leave A Reply

Your email address will not be published.