మాదాపూర్, ముద్ర విలేఖరి: శేరిలింగంపల్లి డివిజన్ పరిధిలోని హల్ కాలనీ లో రూ.4 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో నూతనంగా చేపడుతున్న సీసీ రోడ్ల నిర్మాణం పనులను ఇంజనీరింగ్ విభాగం అధికారులతో కలిసి పరిశీలించిన పీయేసీ చైర్మన్ ఆరెకపూడి గాంధీ.ఈ సందర్భంగా చైర్మన్ గాంధీ మాట్లాడుతూ హల్ కాలనీ లో ఎన్నో ఏండ్ల సమస్య నేటి తో తిరినది అని, హల్ కాలనీ తో పాటు కె.ఎం.ఆర్ ఎస్టేట్ , పారా మౌంట్ కాలనీల తో పాటు చుట్టుపక్కల కాలనీల వాసులకు ఎంతగానో ఉపయోగపడుతుంది అని ప్రజలకు సాంత్వన చేకూరింది అని, ప్రజల సంక్షేమం మరియు శేరిలింగంపల్లి నియోజకవర్గం మరియు కాలనీ ల అభివృద్దే ధ్యేయంగా ప్రజల సౌకర్యార్థం 4 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో నూతనంగా సీసీ రోడ్ల నిర్మాణం పనులను ప్రారంభించుకోవడం జరిగిందన్నారు. పనుల్లో జాప్యం లేకుండా త్వరిత గతిన పనులు పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని PAC చైర్మన్ గాంధీ గారు అధికారులను ఆదేశించడం జరిగినది , ప్రజలకు మెరుగైన రవాణా సౌకర్యం కలిపిస్తామని ,ప్రజలకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా సుఖవంతమైన ప్రయాణానికి బాటలు వేస్తామని చైర్మన్ గాంధీ చెప్పారు. నియోజకవర్గ అభివృద్ధికి శాయశక్తులా కృషి చేస్తానని ,అన్నివేళలో ప్రజలకు అందుబాటులోకి ఉంటానని ,మెరుగైన ప్రజా జీవనానికి అన్ని రకాల మౌలిక వసతుల కల్పనకు తనవంతు కృషి చేస్తానని, శేరిలింగంపల్లి డివిజన్ మరియు శేరిలింగంపల్లి నియోజకవర్గాన్ని ఆదర్శవంతమైన నియోజకవర్గంగా తీర్చిదిద్దుతానని చైర్మన్ గాంధీ పునరుద్ఘాటించారు.ఈ కార్యక్రమంలో ఇంజనీరింగ్ విభాగం అధికారులు డీఈ ఆనంద్, ఏఈ భాస్కర్, నాయకులు ఎర్రగుడ్ల శ్రీనివాస్ యాదవ్, దాత్రి గౌడ్, హరికృష్ణ మరియు కాలనీ వాసులు తదితరులు పాల్గొన్నారు.
