- TUWJ (IJU) డైరీ ఆవిష్కరణలో లోకల్ బాడీ అదనపు కలెక్టర్
ముద్ర ప్రతినిధి,వనపర్తి : సంచిత్ గంగ్వార్జర్నలిస్టు ఆరోగ్య సమాజ అభివృద్ధికి కృషిచేయాలని లోకల్ బాడీ అదనపు కలెక్టర్ సంచిత్ గంగ్వార్ పేర్కొన్నారు. శనివారం కలెక్టర్ ఛాంబర్ లో తెలంగాణ రాష్ట్ర యూనియన్ వర్కింగ్ జర్నలిస్టు ఐజేయు నూతన డైరీ ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జర్నలిజం వృత్తి పవిత్రమైనదని, సేవా రంగానికి సంబంధించినదని ప్రజలను మేల్కొల్పే కథనాలను ప్రచురించాలని ఆయన సూచించారు. ఆరోగ్యకరమైన సమాజానికి ప్రజలకు ఉపయోగపడే అనేక అంశాలను తెలియజేయాలని ప్రభుత్వం ప్రజలకు అందిస్తున్న సంక్షేమ పథకాల పట్ల ఎప్పటికప్పుడు జాగ్రత్తతో కథనాలను ప్రచురించాలని చెప్పారు.
గత 30 ఏళ్లుగా టియుడబ్ల్యూజే ఐజేయు యూనియన్ డైరీని ఆవిష్కరిస్తూ వస్తూ ఉందని ఈ డైరీ రోజువారీగా ప్రచురించే కథనాలను ఎప్పటికప్పుడు రివ్యూ చేస్తూ కొత్త పద్ధతిలో స్టోరీలు రాసేందుకు జర్నలిస్టులకు ఉపయోగపడుతుందని అన్నారు. జర్నలిస్టుల హక్కుల కోసం సంఘాలు పనిచేస్తాయని గుర్తు చేశారు. ప్రభుత్వానికి ప్రజలకు అనుసంధానకర్తలుగా వారదులుగా జర్నలిస్టులు పనిచేస్తారని టీయూడబ్ల్యూజే ఐజేయు రాష్ట్ర కార్యదర్శి మధు గౌడ్ అన్నారు. ప్రభుత్వానికి ప్రభుత్వ అధికారులకు ప్రజల మధ్య సంబంధాలు కొనసాగిస్తూ ప్రజా చైతన్యానికి అనేక కథనాలు రాస్తూ మేలుకొలుపుతారన్నారు. జర్నలిస్టుల హక్కుల కోసం సంఘం పనిచేస్తుందని అనేక సంఘటనలు వాస్తవాలు కథనాలు సరైన ఆలోచనలు సత్యాలను సమాజం కోసం కచ్చితత్వాన్ని ప్రజలకు అందిస్తూ సేవ చేస్తున్న వారు జర్నలిస్టులనీ పేర్కొన్నారు. ప్రతి ఏడాది జిల్లాలోని ముఖ్యమైన అధికారులకు డైరీలు అందజేస్తున్నామని అన్నారు.
జర్నలిజం పవిత్రమైన వృత్తి- డీపీఆర్వో సీతారాం
జర్నలిజం పవిత్రమైన వృత్తి అని ఈ పవిత్రమైన వృత్తిలో మనమందరం కలిసి నడుద్దామని వనపర్తి డి పి ఆర్ ఓ వెల్లడించారు. శనివారం టి యు డబ్ల్యూ జే ఐ జే యు డైరీని ఆయన ఆవిష్కరణ గావించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జర్నలిజం పవిత్రమైనదని అలాంటి వృత్తిలో ప్రభుత్వ పథకాలను ప్రజలకు చేరువయేలా మన కథనాలు ఉండాలని పథకాల మన రాసిన కథనాల వల్ల అంతిమంగా ప్రజలకు మేలుకొలుపు విధంగా ఉండేలా రాయాలన్నారు. రోజువారీగా మన పనితనాన్ని ప్రతిబింబించేందుకు ఎప్పటికప్పుడు నెమరు వేసుకొని మరింత ముందుకు సాగేందుకు జర్నలిస్టులకు డైరీ ఉపయోగపడుతుందన్నారు. వృత్తి లో మేలుకొలుపు కోసం డైరీ ఉపయోగపడుతుందని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా మాజీ ప్రధాన కార్యదర్శి డి మాధవరావు, సీనియర్ పాత్రికేయులు మల్యాల బాలస్వామి, పౌర్ణ రెడ్డి, కొంతం ప్రశాంత్, కొండన్న యాదవ్, రాజేందర్, మాజీ పట్టణ అధ్యక్షులు బి లక్ష్మణ్, నా కొండయ్య యాదవ్, బి విజయ్ కుమార్, మాజీ పట్టణ అధ్యక్షుడు రవికాంత్, పట్టణ మాజీ ప్రధాన కార్యదర్శి ద్వారపోగు మన్యం, ఎస్వీ రమేష్, టి అరుణ్ రాజ్, ఎలక్ట్రానిక్ మీడియా ఎన్ టివి అంజి, బి ఆర్ కే టి వి వహీద్, నరసింహ రాజు, బిగ్ టీవీ అరుణ్,తదితరులు పాల్గొన్నారు.