Kodad Municipal Results :పోలయిన ఓట్లలో 55 % కాంగ్రెస్ అభ్యర్థులకు 23.87 % బిఆర్ఎస్ కి మిగిలిన వారికి 21.13%
ముద్ర ప్రతినిధి , కోదాడ …. కోదాడ మున్సిపాలిటీలో మొత్తం 40881 ఓట్లు పోలవ్వగా అందులో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులకు 54.98 శాతం అంటే 22,477 పోలవ్వగా బిఆర్ఎస్ అభ్యర్థులకు 23.87శాతం అంటే 9761 ఓట్లు పోలయ్యాయి . ఇక బీజేపీ కి 891 , జనసేన పార్టీకి 198 , సీపీఎం, ఇండిపెండెంట్లు , నోటా , చెల్లని ఓట్లు 8554 ఓట్లు పోలయ్యాయి . అయితే 2 వ వార్డు కాంగ్రెస్ బలపర్చిన స్వతంత్ర అభ్యర్థి కి 812 ఓట్లు కూడా కాంగ్రెస్ ఖాతాలో వేస్తే కాంగ్రెస్ కి 56.96 శాతం ఓట్లు నమోదు అయినట్లు తెలుస్తుంది . ఈ ఎన్నికలలో బీజేపీ , జనసేన , సీపీఎం కు ఆశించిన స్థాయిలో ఓట్లు రాకపోవడం గమనార్హం .