Take a fresh look at your lifestyle.

ఆందోల్ జోగిపేట లో అంబరాలను అంటిన కాంగ్రెస్ పార్టీ సంబరాలు-మంత్రి దామోదర్ రాజనర్సింహ

సంగారెడ్డి ముద్ర ప్రతినిధి

జోగిపేట చౌరస్తా లోని మహాత్మా బసవేశ్వర స్వామి, బాబాసాహెబ్ అంబేడ్కర్ గారి విగ్రహాలకు పూలమాలలు వేసి మున్సిపాలిటీ ఎన్నికల్లో భారీ విజయాన్ని సాధించిన సందర్భంగా పార్టీ కార్యకర్తలతో విజయోత్సవ ర్యాలీ లో పాల్గోన్నారు.

అందొల్ జోగిపేట మున్సిపాలిటీ లోని మొత్తం 20 వార్డులలో తొలిసారిగా మంత్రి దామోదర్ రాజనర్సింహ గారి నాయకత్వం లో 16 వార్డులలో కాంగ్రెస్ పార్టీ భారీ మెజారిటీ సాధించి చరిత్ర సృష్టించిన సందర్భంగా బాణాసంచా కాల్చి, డప్పులతో, పార్టీ కార్యకర్తలు డ్యాన్స్ లు చేస్తూ, తమ ఆనందాన్ని పంచుకున్నారు. ర్యాలీ లో కార్యకర్తల సంబరాలు, ఆనందోత్సవాలు మిన్నంటాయి.

భారీ ర్యాలీ లో రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ గారు కార్యకర్తలకు అభివాదం చేస్తూ ఉత్సాహాన్ని నింపారు. ఆందోల్ – జోగిపేట మున్సిపాలిటీలో కాంగ్రెస్ పార్టీ అఖండ విజయం సాధించటం లో కార్యకర్తలను , ముఖ్య నాయకులను, అభ్యర్థులను అభినందించారు.

Leave A Reply

Your email address will not be published.