Take a fresh look at your lifestyle.

మోత్కూర్ మున్సిపాలిటీపై కాంగ్రెస్ జెండా.

మోత్కూర్ ముద్ర న్యూస్: 2వ సాధారణ మున్సిపల్ ఎన్నికల్లో భాగముగా శుక్రవారం భువనగిరి లోని దివ్య బాల హై స్కూల్ లో మున్సిపల్ ఎన్నికల ఓట్ల లెక్కింపు నిర్వహించడం జరిగినదని మున్సిపల్ కమిషనర్ కే సతీష్ కుమార్ తెలిపారు. ఈ సందర్భంగా మున్సిపల్ కమిషనర్ మాట్లాడుతూ 1,2,6,7,8,9,11,12 వార్డులలో కాంగ్రెస్ అభ్యర్థులు, 3,4,10 వార్డులలో బిఆర్ఎస్ అభ్యర్థులు, 5 వార్డు స్వతంత్ర అభ్యర్థి గెలుపొందినట్లు ఆయన తెలిపారు. ఒకటవ వార్డులో టిఆర్ఎస్ అభ్యర్థి సొల్లేటి నరేష్ పై కాంగ్రెస్ అభ్యర్థి పల్లెర్ల వెంకన్న ఎనిమిది వందల ఆరు ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. రెండవ వార్డు టిఆర్ఎస్ అభ్యర్థి మర్రి జయమ్మ పై కాంగ్రెస్ అభ్యర్థి కురిమిళ్ళ ప్రమీల 27 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు మూడో వార్డులో కాంగ్రెస్ అభ్యర్థి సుల్తానా మనోజ్ కుమార్ పై టీఆర్ఎస్ అభ్యర్థి సుల్తానా స్వామి 116 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు నాల్గవ వార్డులో కాంగ్రెస్ అభ్యర్థి కస్తూరి జ్యోతిపై టిఆర్ఎస్ అభ్యర్థి కొండా శోభ సోంమల్లు126 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు.5 వ వార్డు టిఆర్ఎస్ అభ్యర్థి కోకా రేణుకపై ఇండిపెండెంట్ అభ్యర్థి మొగుళ్ల అనురాధ 55 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు.6 వ వార్డులో టిఆర్ఎస్ అభ్యర్థి దాసరి తిరుమలేష్ పై కాంగ్రెస్ అభ్యర్థి గడ్డం స్వప్న 173 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. ఏడవ వార్డులో టిఆర్ఎస్ అభ్యర్థి గుంటూర్ శ్రీలతపై కాంగ్రెస్ అభ్యర్థి గణగాని శైలజ 394 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు 8వ వార్డులో టిఆర్ఎస్ అభ్యర్థి ఎడ్ల రమాదేవి సిపిఐ అభ్యర్థి కూరపాటి జయంమలపై కాంగ్రెస్ అభ్యర్థి పొన్నాల శ్రీవిద్య 839 ఓట్ల భారీ మెజారిటీతో విజయం సాధించారు. తొమ్మిదవ వార్డులో టిఆర్ఎస్ అభ్యర్థి మన్నె బీమాయ పై కాంగ్రెస్ అభ్యర్థి బీసు శ్రీకాంత్ గౌడ్ 240 కోట్ల మెజార్టీతో విజయం సాధించారు. పదవ వార్డులో కాంగ్రెస్ అభ్యర్థి వర్రే మహేందర్ పై బీఆర్ఎస్ అభ్యర్థి నల్ల మధు 53 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. 11వ వార్డులో టిఆర్ఎస్ అభ్యర్థి పసల మరి అన్నపై కాంగ్రెస్ అభ్యర్థి కారుపోతుల వెంకన్న 284 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. 12వ వార్డులో టిఆర్ఎస్ అభ్యర్థి కూరెల్ల పద్మపై కాంగ్రెస్ అభ్యర్థి మెంట రమణ 141 ఓట్ల మెజారిటీతో విజయం సాధించి మోత్కూర్ మున్సిపాలిటీపై కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరవేశారు.

Leave A Reply

Your email address will not be published.