Take a fresh look at your lifestyle.

మాజీ స్పీకర్ శ్రీపాద రావుకు కాంగ్రెస్ నేతల నివాళి

 ముద్ర ప్రతినిధి ,ఇబ్రహీంపట్నం: తెలంగాణ బ్రాహ్మణ సేవా సమితి ఆధ్వర్యంలో మాజీ స్పీకర్ దుద్ధిల్ల శ్రీపాద రావు 88 వ జయంతి వేడుకలను తుర్కయాంజాల్ మున్సిపల్ కేంద్రంలో ఆదివారం ఘనంగా నిర్వహించారు.కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు మల్ రెడ్డి అభిషేక్ రెడ్డితో పాటు కాంగ్రెస్ శ్రేణులు శ్రీపాదరావు చిత్ర పటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మున్సిపల్ అధ్యక్షులు కొత్తకుర్మ మంగమ్మ,మాజీ కౌన్సిలర్లు కోషిక ఐలయ్య, కాకుమాను సునీల్,సీనియర్ కాంగ్రెస్ నాయకులు కొత్తకుర్మ శివ కుమార్,సామ భీమ్ రెడ్డి, పూజారి శంకర్ గౌడ్, కుంట గోపాల్ రెడ్డి,మేతరీ దర్శన్,ముత్యాల రాజశేఖర్,బ్రాహ్మణ సేవా సమితి సభ్యులు కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.