Take a fresh look at your lifestyle.

ఎస్బిఐ ఏటీఎంలో భారీ చోరి.. రూ. 30 లకల అపహరణ

  • కారులో వచ్చి.. సినీ ఫక్కీలో చోరి
  • ఎస్బిఐ మేనేజర్ ఫిర్యాదుతో కేసు నమోదు

ఇబ్రహీంపట్నం, ముద్ర ప్రతినిధి: గుర్తు తెలియని నలుగురు దుండగులు ఏటీఎం చోరీ చేసి రూ.30 లక్షలు ఎత్తుకెళ్లిన ఘటన ఆదిభట్ల పోలీస్ స్టేషన్ పరిధిలో శనివారం అర్ధ రాత్రి చోటుచేసుకుంది. బ్యాంక్ మేనేజర్ ఫిర్యాదుతో ఆదిభట్ల పోలీస్ స్టేషన్ లో కేసు నమోదయ్యింది.ఈ అనఘటనకు సంబంధించిన వివరాలు,ఆదిభట్ల పోలీస్ స్టేషన్ పరిధిలోని రావిర్యాల గ్రామంలో ఎస్బీఐ ఏటీఎం చోరీకి గురైంది.ఓ కారులో వచ్చిన నలుగురు గుర్తుతెలియని దుండగులు ముందుగా సీసీ కెమెరాలకు స్ప్రే కొట్టి ఎమర్జెన్సీ సైరన్ మోగకుండా సెన్సార్ వైర్లను కట్ చేశారు. కట్టర్, ఇనుపరాడ్ల సహాయంతో ఏటీఎంను పగలకొట్టి డబ్బులు దోచుకొని పారిపోయారు.సినీ ఫక్కీలో ఈ చోరి జరగడం తీవ్ర కలకలం రేపింది.ఈ సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని ఏటీఎంను పరిశీలించారు.మహేశ్వరం డీసీపీ సునీత రెడ్డి, ఏసీపీ కేపీవీ రాజుల నేతృత్వంలో ఆదిభట్ల పోలీసులు చోరీ చేసిన దుండగుల కోసం బృందాలుగా ఏర్పడి గాలిస్తున్నట్లు సమాచారం.

Leave A Reply

Your email address will not be published.