ముద్ర, ఉమ్మడి
మహబూబ్ నగర్ జిల్లా ప్రతినిధి:
……………………………………….
మహబూబ్‌నగర్ పట్టణం లోని క్రీడా మైదానంలోని ఇండోర్ స్టేడియంలో 2వ ఎడిషన్ రాష్ట్ర స్థాయి సీఎం కప్–2025 పోటీలు (బాక్సింగ్ & నెట్‌బాల్) ఘనంగా ప్రారంభమయ్యాయి.ఈ కార్యక్రమంలో తెలంగాణ ఒలింపిక్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు,ప్రభుత్వ సలహాదారు(క్రీడలు) ఏపి జితేందర్ రెడ్డి,టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఏపి మిథున్ రెడ్డి పాల్గొన్నారు.ఈ సందర్భంగా జితేందర్ రెడ్డి మాట్లాడుతూ..క్రీడలు కేవలం శారీరక దృఢత్వానికే పరిమితం కాకుండా, మానసిక స్థైర్యం,నాయకత్వ లక్షణాలు,క్రమశిక్షణ,సమయపాలన,సహనశక్తి వంటి విలువలను పెంపొందించే సాధనమని పేర్కొన్నారు.రాష్ట్ర స్థాయి సీఎం కప్–2025 పోటీలు యువ క్రీడాకారులకు తమ ప్రతిభను ప్రదర్శించుకునే గొప్ప వేదికగా నిలుస్తాయని తెలిపారు.గ్రామీణ ప్రాంతాల్లో అపారమైన ప్రతిభ కలిగిన క్రీడాకారులు ఉన్నారని, వారికి సరైన మార్గదర్శకత్వం,ప్రోత్సాహం లభిస్తే జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో మహబూబ్‌నగర్ జిల్లా పేరును గర్వంగా నిలబెట్టగలరన్నారు.ఈ కార్యక్రమంలో తెలంగాణ ఒలింపిక్ అసోసియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మల్ల రెడ్డి ,ప్రతాప్ రెడ్డి,ధనుంజయ్ గౌడ్ , నర్సింహులు,మార్కెట్ కమిటీ చైర్మన్ బెక్కరి అనిత ,గోపాల్ యాదవ్ ,చిన్న వీరయ్య, డివైఎస్ఓ శ్రీనివాస్ ,క్రీడా అధికారులు,క్రీడాకారులు తదితరులు పాల్గొన్నారు.
………………………………….
Naresh is a Asst Editor and he is working with our organisation and he has good knowledge on Content uploads and Content Management in website. He takes cares of all Content uploads and Content administration on our website.
Prev Post